S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐదువేల కోట్లు అడిగాం

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కరెన్సీ నోట్ల సమస్య పరిష్కారానికి తక్షణమే ఐదువేల కోట్ల రూపాయల చిన్ననోట్లను పంపించాలని కేంద్రాన్ని కోరామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక్కడి ఎస్‌బిహెచ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 13వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ, 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం మంచిదేనని అన్నారు. దేశంలో 80 శాతం కరెన్సీ 500, 1000 రూపాయల నోట్ల రూపంలోనే ఉందన్నారు. కొద్దిమంది వద్ద కోట్లాది రూపాయలు బ్లాక్‌మనీ గుట్టలుగా పడిఉన్నాయన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావలసి ఉందన్నారు. నోట్లరద్దుపై కేంద్రం నిర్ణయం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. నోట్లరద్దు వల్ల కోడిగుడ్లు, కోళ్ల ధరలు పడిపోయాయని, ఉద్యాన పంటల ధరలు తగ్గించాల్సి వచ్చిందని, దీనివల్ల రైతులు ఆర్థికంగా చితికపోతున్నారన్నారు. నిర్మాణం పనులు ఇతర పనులు నిలిచిపోవడం వల్ల రోజువారీ కూలీలకు ఉపాధి లభించడం లేదన్నారు. ఈ సమస్యకు బ్యాంకర్లే ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలన్నారు. జనాభాలో దాదాపు 35 శాతం పేద కుటుంబాలకు (36.59 లక్షల కుటుంబాలు) ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆసరా’ పథకంవల్ల నెలకు వెయ్యి రూపాయలు లభిస్తున్నాయని గుర్తు చేశారు. చిన్ననోట్లు లేకపోవడం వల్ల ఆసరా పింఛన్లు చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. బ్యాంకుల్లో కరెన్సీ లేకపోవడం వల్ల వీరికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాన్ని మూడు నెలల పాటు చెల్లించకపోతే అవి ఎన్‌పిఎ (నిరర్ధక ఆస్తులు)గా గుర్తిస్తున్నారని, ఈ నిబంధనలో మార్పు చేయాలని కోరారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చేయూత ఇవ్వాలని కోరామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించామని వివరించారు.
రైతు రుణాలపై నిర్లక్ష్యమా: మంత్రి పోచారం
రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో ఆంధ్రాబ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకులు బాగానే పనిచేస్తున్నప్పటికీ, సిండికేట్ తదితర బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయ మంత్రి పోచారం నిప్పులు చెరిగారు. 2016 ఖరీఫ్ సీజన్‌లో 36.52 లక్షల మంది రైతులకు 17480 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, 22.50 లక్షల మందికి 15205 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారన్నారు. పబ్లిక్ రంగ బ్యాంకులు 45 శాతం, ప్రైవేట్ బ్యాంకులు 88 శాతం, సహకార బ్యాంకులు 52 శాతం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 92 శాతం లక్ష్యాలను సాధించాయని గుర్తు చేశారు. వంద శాతం లక్ష్యం ఎందుకు సాధించలేమన్నారు. ఈ పరిస్థితిలోనే పైవేట్ వడ్డీ వ్యాపారులను రైతులు ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. కొన్ని బ్యాంకులు రైతుల నుండి వడ్డీతో సహా రుణాలను కట్టించుకుంటున్నారని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయకపోతే ఈ సమావేశాలను నిర్వహించడం ఎందుకంటూ నిలదీశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రుణమాఫీ నాలుగోవిడతను రైతులకే నేరుగా చెల్లిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తనదారిలో వెళుతుందని బ్యాంకర్లు వేరే దారి చూసుకోవచ్చని తీవ్రస్వరంతో పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, ఆర్‌బిఐ రీజనల్ డైరెక్టర్ ఆర్‌ఎన్ దాస్, ఆర్‌బిఐ సిజిఎం ఆర్ బాలసుబ్రమణియన్, ఎస్‌బిఐ సిజిఎం హర్‌దయాల్ ప్రసాద్, ఎస్‌బిహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతను ముఖర్జీ, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ వి. విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... హైదరాబాద్‌లోని ఎస్‌బిహెచ్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన రాష్టస్థ్రాయ బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న
రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం, ప్రభుత్వ శాఖల, బ్యాంకుల అధికారులు