S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ట్రైసిటీగా తిరుపతి - కృష్ణపట్నం - శ్రీసిటీ

విజయవాడ, నవంబర్ 24: తిరుపతి, కృష్ణపట్నం, శ్రీ సిటీలను ట్రైసిటీగా అభివృద్ధి చేసి మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం రాత్రి సిఎంఓలో తనను కలిసిన ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ బృందంతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి యూనిట్లను తెరిచే సెల్యులర్ కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలిస్తామని అన్నారు. తనను విశ్వసించి పెట్టుబడులు పెట్టాలని, ఇక్కడ ఉత్పాదక యూనిట్లు తెరవాలని వారికి అన్ని రాయితీలతో సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పంకజ్ మొహింద్రూ మాట్లాడుతూ భారత ప్రభుత్వం దిశానిర్దేశం మేర దేశంలో 2019 నాటికి 500 మిలియన్ల మొబైల్ హ్యాండ్ సెట్లు తయారు చేయాలన్నది లక్ష్యమని అన్నారు. తద్వారా పదిహేను లక్షల అదనపు ఉద్యోగాలకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రూ. 50వేల కోట్ల బిజినెస్ టర్నోవర్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తులపై పన్ను మినహాయింపులు ఇస్తే శరవేగంతో మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలు విస్తరిస్తాయని తెలిపారు. ఇప్పటికే దేశంలో అంతర్జాతీయ కంపెనీలైన పేరున్న ప్లెక్స్ ట్రానిక్స్, ఫ్యాక్స్ కాన్, కొంపాల్ ఉత్పత్తిని ఆరంభించాయన్నారు. ఈ కంపెనీలు హ్యూవీ, విఓ, అప్పొ బ్రాండ్లతో విక్రయాలు ప్రారంభించాయని వివరించారు. చైనాలో ఉత్పత్తి రంగం సమీప భవిష్యత్తులో భారత్‌కు తరలివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది తమ అంచనా అని చెప్పారు.
తెలుగు విద్యాపీఠ్ ఏర్పాటు ప్రతిపాదన లేదు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, నవంబర్ 24: గుంటూరు జిల్లాలో తెలుగు విద్యాపీఠ్ ఏర్పాటు అంశం తమ పరిశీలనలోలేదని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. తెలుగు విద్యాపీఠ్ అంశాన్ని టిడిపి ఎంపీ టిజి వెంకటేశ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు హెచ్‌ఆర్‌డి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. విభజన చట్టంలో కేంద్రీయ, గిరిజన వర్శిటీల ఏర్పాటు అంశం ఉందని అందులో పేర్కొన్నారు.
ఈనెల డిపోల్లోనే జీతాలు నగదుగా చెల్లించాలి
ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 24: ఆర్టీసి కార్మికులకు ఎప్పటిలాగే బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించకుండా ఈనెల అన్ని డిపోల్లో నగదు రూపేణ జీతాలు చెల్లించాలని ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు పలిశెట్టి దామోదర్, పద్మాకర్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్మికుల వేతనాలు ఎప్పటిలాగే బ్యాంకుల్లో వేస్తే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, దీంతో బస్సులు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసి కార్మికులకు జీతాలు ఆయా డిపోల్లోనే నగదు చెల్లిస్తే బాగుంటుందని యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు కార్మికుల వేతనాల చెల్లింపుపై అధికారులతో చర్చిస్తామని ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య చెప్పినట్టు కార్మిక నాయకులు తెలిపారు.