S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎస్టీ విద్యార్థులకూ మెస్ చార్జీలు

హైదరాబాద్, నవంబర్ 24: ఎస్సీ, బిసిలకు మాదిరిగానే ఇకపై ఎస్టీ విద్యార్థులకు కూడా పోస్టు మెట్రిక్ హాస్టళ్ల నెలవారిగా నిర్వహణ ఖర్చులను చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై గురువారం ముఖ్యమంత్రి సంతకం చేశారు. క్యాంపు కార్యాలయం కొత్త భవనంలోకి గృహ ప్రవేశం చేశాక ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకం ఈ ఫైలుపైనే కావడం విశేషం. రాష్ట్రంలో 101 ఎస్టీ హాస్టళ్లలో 14,685 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి నెలనెలా కాకుండా ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి బిల్లులు చెల్లించేవారన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి ఎస్టీ విద్యార్థులకు కూడా నెలవారీగా ఇవ్వాలని నిర్ణయించినట్టు కెసిఆర్ వెల్లడించారు. ప్రతీ విద్యార్థికి ఇకపై నెలకు రూ.1050 నుంచి రూ.1200 వరకు చెల్లిస్తారని సిఎం వెల్లడించారు.