S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సింగరేణితో మహారాష్ట్ర జెన్కో ఒప్పందం

హైదరాబాద్, నవంబర్ 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో సింగరేణి నుంచి మరో పది లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేయడానికి మహారాష్ట్ర జెన్కో తాజాగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర జెన్కో ఉన్నతాధికారి అరవింద్ కె.చంద్రగడే, సింగరేణి జనరల్ మేనేజర్ బి.కిషన్‌రావు ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. సింగరేణి నుంచి పది లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేసేందుకు తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ ఒప్పందం చేసుకున్న మరుసటి రోజే మహారాష్ట్ర కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మహారాష్ట్ర జెన్కో నిర్వహిస్తున్న చంద్రాపూర్, కపర్ ఖెడా, నాసిక్ మొదలైన విద్యుత్ కర్మాగారాలకు మరో పది లక్షల టన్నుల బొగ్గు తీసుకునేందుకు కూడా సింగరేణి అధికారులతో చర్చించారు.

ఒప్పందంపై సంతకాలు చేసిన మహారాష్ట్ర జెన్కో ఉన్నతాధికారి అరవింద్ కె.చంద్రగడే, సింగరేణి జనరల్ మేనేజర్ బి.కిషన్‌రావు