S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇ-కెవైసి తప్పనిసరి

విజయవాడ, నవంబర్ 24: ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వినియోగంలో ఇకపై ఇ-కెవైసీని తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇ-కెవైసీ అనుసంధానం ద్వారా ప్రజా సాధికార సర్వేను సంపూర్ణం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సర్వేను పూర్తిచేయడానికి ఇంకా కొద్ది రోజులే గడువు వుందంటూ, ఈ స్వల్ప వ్యవధిలో సర్వేను మరింత సమగ్రంగా చేపట్టేందుకు ఆధార్, ఇ-కెవైసీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని మార్గాల ద్వారా ప్రయత్నించాలని చెప్పారు. విజయవాడలో పోలీస్ కమాండ్ కమ్యూనికేషన్స్ సెంటర్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సాధికార సర్వే జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను ఆశించి ఈ సర్వేను చేపట్టామని, సర్వేలో వచ్చిన సమాచారం ఆధారంగా ఇకపై ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు లబ్థిదారులకు చేరతాయని చెప్పారు.
ఇటీవల కరెన్సీ రద్దు నిర్ణయం దరిమిలా ప్రజా సాధికార సర్వేకు ప్రాధాన్యం పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 4,16,03,559 మంది సర్వే పూర్తి చేసుకున్నారని అధికారులు వివరించారు. 1,36,63,753 ఇళ్లలో సర్వే పూర్తయిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ సర్వేపై పడిందని పలువురు కలెక్టర్లు సిఎం దృష్టికి తీసుకువచ్చారు. గడువు సమీపిస్తున్నా కొన్ని చోట్ల సర్వే సజావుగా సాగడం లేదని, ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో సర్వే మందకొడిగా వున్నదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజా పంపిణీ నిత్యావసరాలు, పింఛన్లు, ఉపకార వేతనాలు పొందే లబ్దిదారుల ఇ-కెవైసీ డేటాను పరిశీలించి స్మార్ట్ సర్వే చేయించుకుని వారిని గుర్తించాలని ముఖ్యమంత్రి చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సులు, ఆధార్ కార్డు సమాచారంతో సాధికార సర్వే డేటాను సరిపోల్చి చూడాలని సూచించారు. డూప్లికేషన్ లేకుండా ఖచ్చితమైన సమాచారం రాబట్టాలని అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సాధికార సర్వే పెండింగ్‌లో వున్నదని, అలాంటి చోట్ల అదనపు సిబ్బంది సేవలను వినియోగించుకుని ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా సాధికార సర్వేను పూర్తి చేసి పోర్టల్ ద్వారా బహిర్గతపర్చాలని, పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులలో వుంచాలని సూచించారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రత్యేక కౌంటర్లు పెట్టి అప్పటికి సర్వే చేయించుకోని వారికి మరో అవకాశం ఇద్దామని చెప్పారు. మొత్తంమీద డిసెంబరు నెలాఖరులోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఎఐయుఐడి ఛైర్మన్ జె.సత్యనారాయణ, సిసిఎల్‌ఎ అనిల్ చంద్ర పునేఠా, ఐటి కార్యదర్శి ప్రద్యుమ్న, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రాజవౌళి, 13 జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.