S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై ఉక్కుపాదం

ఏలూరు, నవంబర్ 26: దేశానికి స్వచ్ఛమైన పాలన అందిస్తూ, అన్నివర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదిని ప్రజలు దేవుని దూతగా చూస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ తీసుకున్న చర్యలను వివరిస్తూ ఎక్కడా అవినీతి మచ్చ లేని పాలన అందిస్తున్నారని ప్రస్తుతించారు. ఇలాంటి పరిస్ధితి చూసే జనం అంతా సంతృప్తిగా ఉన్నారని, అయితే ఇది భరించలేక విపక్షాలు అర్ధం లేని విమర్శలకు దిగుతూ యాగీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర బిజెపి ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో శనివారం నిర్వహించిన రైతుమహాసభలో ఆయన మాట్లాడారు. నల్లధనం, ఉగ్రవాదం, అవినీతిపై ప్రధాని మోది శంఖారావం పూరించారని, దీనికి మనమంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత 60 ఏళ్ల పాలనలో దేశంలో అన్నిరకాల కష్టాలు అలుముకున్నాయని, పేదరికాన్ని పెంచారని విమర్శించారు. వైషమ్యాలు, అంతరాలు పెంచటంతోపాటు రూపాయి విలువను పతనం చేశారని ఆరోపించారు. ఇటువంటి అంధకారంలో ఆశాకిరణంలా నరేంద్ర మోదిని ప్రధానిమంత్రిగా దేశప్రజలు ఎన్నుకుని ‘ ఏబుల్ లీడర్-స్టేబుల్ గవర్నమెంట్’కు బాటలు వేశారన్నారు. దేశంలో మహాయజ్ఞానికి అంకురార్పణ చేసిన మోది సమాంతర ఆర్ధిక వ్యవస్ధగా మారిన నల్లధనం, దొంగనోట్ల తయారీని పూర్తిస్ధాయిలో అరికట్టేందుకు పెద్దనోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇది ఏ ఒక్కరినో దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదని, ఆర్థికవ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడానికి తీసుకున్న నిర్ణయమని అభివర్ణించారు. పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీయటంతోపాటు తీవ్రవాదులను ప్రోత్సహిస్తూ దేశ ఆర్ధికవ్యవస్ధను చిన్నాభిన్నం చేస్తున్న పాకిస్తాన్ కోరలు పీకేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామ, రైతు, పేద, యువత, మహిళలకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం లేని ప్రతిపక్షాలు నిర్ణయం బాగానే ఉంది... కానీ...కానీ అంటూ నంగనాచి కబుర్లు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. గత రెండున్నరేళ్లలో దేశంలో ఒక్క స్కాంకాని, స్కాండల్ కాని చోటుచేసుకోలేదని, ఈపరిస్థితిలో ఎవరూ వేలెత్తిచూపే ధైర్యం లేక అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూమి, భూగర్భం, ఆకాశం, అంతరిక్షం అన్న తేడా లేకుండా ప్రతిదానిలోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల అట్టడుగువర్గాలకు, దళితులకు మేలు జరుగుతుందని, ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు ద్రవ్యోల్భణం తగ్గి అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇక కమ్యూనిజంలో నిజం మాయం అయిందన్న విషయం జనానికి తెల్సిపోయిందని, అందుకే కమ్యూనిస్టు పార్టీలు బంద్‌లు వంటివాటికి పిలుపునిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రానున్న కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమైన కొల్లేరు సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సభలో ధవళేశ్వరం బ్యారేజి నిర్మాణంలో కాటన్‌దొరతోపాటు కలిసి పనిచేసిన వీరన్న చిత్రపటాన్ని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
మోదీ ప్రకటించిన స్వచ్ఛ్భారత్ అంటే కేవలం పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాదని, శరీరం (తన్), మనస్సు (మన్), ధనం (్ధన్) కూడా పరిశుభ్రంగా ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు. తన్, మన్ పరిశుభ్రతతోపాటు ప్రజల వద్ద ఉన్న ధనం కూడా స్వచ్ఛమైనది అయితే నోట్ల రద్దువల్ల వారికి ఎటువంటి నష్టం కలగదన్నారు.

తాడేపల్లిగూడెం బిజెపి సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు