S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భగత్‌సింగ్

భగత్‌సింగ్
తను ఎంతగానో నమ్మి, మహాత్మాగాంధీకి జై అంటూ నినదించిన భగత్‌సింగ్, ఏదో ఊళ్లో ఎవరో చేసిన దానికి దేశాన్ని శిక్షించడం చూసి విచలితుడు అవడం మా హృదయాల్ని కదిలించింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సీరియల్ సాగుతోంది. నమ్మండి ఇది నిజం శీర్షికలో పీతల గురించి రాసిన వివరాలు ఆశ్చర్యం గొలిపాయి. నాలుగున్నర అడుగుల చుట్టుకొలతగల పీతలున్నాయంటే నమ్మలేకపోయాం. అసలు-నకిలీ క్రైం కథ సస్పెన్స్‌తో సాగింది.
-పి.ఎస్.లక్ష్మి, బృందావనం.

భూతాపం
భూమి వేడెక్కిపోవడమే అన్ని అనర్థాలకు కారణం. భూమి అపరిమితంగా వేడెక్కిపోవడానికి మనమే కారణం. ఆ పాపం మనదే. ఆ నష్టం.. కష్టం మనమే భరించాలి. మన తరువాతి తరాలు క్షేమంగా ఉండాలంటే మనం చేసిన తప్పును మనమే సరిదిద్దడం ప్రారంభించాలి. ప్రపంచం ఇప్పుడు దీనిపై దృష్టి పెడుతోందన్న అంశాన్ని ‘్భతాపం - మన పాపం’లో చక్కగా తెలియజేశారు.
-రమణ, (పెద్దాపూర్)

లోకాభిరామం
పుస్తక సమీక్షలపై గోపాలంగారు లోకాభిరామంలో చెప్పిన విషయాలు ఆసక్తికరంగా, తనదైన శైలిలో వివరించారు. ముఖ్యంగా విశ్వనాథవారి తొలిపలుకులు భలేగా ఉన్నాయి. దశాబ్దం క్రితం ఆగిపోయిన ఓ వారపత్రికలో పేర్లు మారేవికానీ సినిమా సమీక్షలన్నీ ఒకేలా ఉండేవి. పుస్తక సమీక్షలూ అంతే. ఇక ఆదివారం అనుబంధంలోని మరో శీర్షిక ‘సండేగీత’ అద్భుతం. మానవ సంబంధాలను విల్లు, వింటినారితో పోల్చడం సహేతుకం.
-అభిలాష, సాంబమూర్తినగర్, తూ.గో.జిల్లా

అది నిజమే
పుస్తక సమీక్షలపై గోపాలం గారు రాసిన వ్యాసంలోని చాలా అంశాల్లో నిజమే ఉంది. పుస్తకాలు పట్టనివారే ఎక్కువ, కొన్ని పుస్తకాలు పట్టుబట్టి చదివించేవి, మరికొన్ని అప్పటికి చదివి వదిలేసేవి, ఎప్పటికీ చదువుకోవలసిన మన షెల్ఫ్‌లో దాచుకోవలసినవి అని వివరించడం చక్కగా ఉంది. విశ్వనాథవారి నిష్కర్ష వ్యాఖ్య బాగానచ్చింది. ప్రపంచ శాస్తవ్రేత్తల వివరాలు, భగత్‌సింగ్, సండేగీత, ఓ చిన్నమాట బాగుంటున్నాయి.
-ఎన్.ఆర్.లక్ష్మి, సికింద్రాబాద్

భూతాపం-మనపాపం
పర్యావరణ పరిరక్షణను పట్టించుకోకపోవడం మనపాపమే. తమిళనాడులోనేకాదు మన రాష్ట్రంలోనూ వర్షబీభత్సం అనుభవమే. వేడి పెరగడానికి మనమే కారణం అని వివరించిన కవర్‌పేజీ కథనం బాగుంది. జనచైతన్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలి. మనలోమనం శీర్షికలో ఓ ప్రశ్నకు మీరిచ్చిన ‘సరసాయనశాస్త్రం’ అన్న సమాధానం మెరుపులా ఉంది.
-గునే్నశ్, కొవ్వాడ

ఇది సరైన దారేనా
తనకు నచ్చిన పద్ధతిలో జీవితాన్ని సాగించి, కుమార్తెను మాత్రం ఆమెకు నచ్చినట్లు కాకుండా తనకు నచ్చినట్లు ఉండాలన్న పట్టుదలతో వ్యవహరించిన ఓ ఆధునిక స్ర్తి, కూతురు అందుకు నిరాకరించి, నిక్కచ్చిగా మాట్లాడటంతో ఆత్మవిమర్శ చేసుకోవడం అన్న ఇతివృత్తంతో సాగిన కథ ‘ఇది సరైన దారేనా నేటి పరిస్థితులకు అద్దంపట్టింది. రచయిత్రికి అభినందనలు. ఇక ఓ చిన్నమాటలో జింబోగారు రాసిన ధనస్సు ఆర్టికల్ అద్భుతం.
-కోలపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

సండేగీత
సండేగీతలో ‘అంతర్గత శక్తి’ అన్న శీర్షికతో రాసిన కథనం స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఈ ధైర్యం, అంతర్గతశక్తి ప్రతివారిలో ఉంటాయని, అయితే ఆ విషయాన్ని గ్రహించి జీవితంలో సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకోవాలని చక్కగా చెప్పారు. అలాగే ఓ చిన్నమాట ‘్ధనస్సు’లో ప్రతిఒక్కరినుంచి నేర్చుకోవాల్సిన విషయం ఉంటుందని చెప్పడం బాగుంది. సిసింద్రిలో వాక్కుప్రభావం కథ బాగుంది.
-పి.ఆదిత్యమూర్తి, గొల్లలమామిడాడ

రణక్షేత్రం
రణక్షేత్రం సీరియల్ ఆద్యంతం సస్పెన్స్‌తో కొనసాగుతోంది. మొదటినుంచి పట్టుజారకుండా కథనాన్ని ముందుకు తీసుకువెళుతున్న పుట్టగంటివారికి అభినందనలు. రావి ఎస్ అవధానిగారి కథ ‘సుశీలమ్మగారి వీలునామా’ సగటు మనుషుల అంతరంగానికి అద్దంపట్టింది. ఆదివారం అనుబంధంలోని అన్ని శీర్షికలు బాగుంటున్నాయి. శాస్ర్తీగారి మనలోమనం అన్నింటిలోనూ హైలెట్‌గా ఉంటున్నది.
-ఎ.వి.సోమయాజులు, కాకినాడ.
అక్షరాలోచనాలు
ఈ శీర్షికన ప్రచురిస్తున్న కవితలు సులభశైలిలో, అర్థమయ్యేలా, భావుకతతో అలరిస్తున్నాయి. పుట్టగంటిగారి రణక్షేత్రం సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక శాస్ర్తీగారి ‘్భగత్‌సింగ్’ చదువుతూంటే కొత్తశక్తి వస్తోంది. మనలోమనం శీర్షికలో శాస్ర్తీగారి సమాధానాలు పేలుతున్నాయి. సిసింద్రి శీర్షికలో ఇచ్చిన వియోగి గారి కథ ‘నిజమైనమందు’ పిల్లలకు ఉపయోగకరంగా ఉంది. భాస్కరాచార్యుడు వ్యాసం బాగుంది.
-గుండు రమణయ్య, కరీంనగర్