S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన సిట్ విచారణ

24/06/2015
TAGS:
విజయవాడ, జూన్ 23: తెలుగు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్న ఓటుకు కోట్లు కుంభకోణం కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన సిట్ విచారణ మంగళవారంతో ముగిసింది. ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యాన విచారణ చేపట్టిన సిట్ బృందం పలు టెలిఫోన్ కంపెనీలకు చెందిన సర్వీసు ప్రొవైడర్లను విచారించారు. మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ చేయగా ఈ రెండురోజుల్లో అందరినీ కలిపి మొత్తం దాదాపు 16 గంటల పాటు విచారించి కావాల్సిన ఆధారాలు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి మరింత లోతైన విచారణ చేయాల్సి ఉందని ఎస్పీ శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియచేశారు. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భేరసారాలకు దిగడం ఈరెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుంటే రెండున్నర కోట్లు, టిడిపికి ఓటు వేస్తు ఐదుకోట్లు భేరానికి మాట్లాడి అడ్వాన్స్ కింద 50లక్షలు ముట్టచేప్పేందుకు తెలంగాణా టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన డీల్‌పై స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో జరిపిన సంభాషణల టేపులు బయటకు వచ్చేసరికి ఏపి ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లైంది. దీంతో తెలంగాణా ప్రభుత్వం, టిఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన సీఎం ఆదేశాల మేరకు ఏపిలో కేసిఆర్‌కు వ్యతిరేకంగా సుమారు 88కేసులు నమోదయ్యాయి. ఏపికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రితో సహా పలువురు అధికారులు సుమారు 140వరకు ఫోన్‌లు ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపిస్తూ ఈ కేసులు నమోదు కాగా.. నగరంలోనే ఎనిమిది వరకు ఫిర్యాదులు అందాయి. దీనిలో భాగంగా జిల్లా మంత్రి దేవినేని ఉమా ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలావుండగా ఈ 88కేసులను విచారించేందుకు సీఎం ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్)) విచారణకు శ్రీకారం చుట్టింది. సిట్ అధికారి ఎస్పీ జి శ్రీనివాస్, ఎఎస్పీలు దామోదర్, నరసింహారావు, కమిషనరేట్ కౌంటర్ ఇంటిలిజెన్స్ సిఐ కాశీవిశ్వనాధ్ బృందం భవానీపురం స్టేషన్‌లో సోమవారం విచారణ ప్రారంభించారు. తొలిరోజు ఐదు కంపెనీలకు చెందిన ప్రొవైడర్లను విచారించారు. సుమారు 11 గంటల పాటు విచారణ జరిపి రెండోరోజు మంగళవారం మరికొందరిని విచారించారు. ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్, బిఎస్‌ఎన్‌ఎల్, యూనినార్, టాటా డొకోమో, ఎయిర్‌సెల్ తదితర కంపెనీలకు చెందిన ఎనిమిది మంది ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేయగా రెండోరోజు ముగ్గురిని విచారించి వారి నుంచి కాల్‌డేటా సేకరించారు. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో విచారణ ముగించిన ఎస్పీ శ్రీనివాస్ ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతానికి ప్రొవైడర్ల విచారణ ముగిసిందని, మరింత లోతుగా విచారించాల్సి ఉందని వెల్లడించారు. అయితే ఈరెండురోజుల పాటు సిట్ జరిపిన విచారణలో కొండను తవ్వినట్లైందిగాని, కనీసం ఎలుకను కూడా పట్టినట్లు లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రొవైడర్లు తమ న్యాయనిపుణులతో సహా విచారణకు హాజరుకావడం ద్వారా పూర్తి స్థాయిలో రాబట్టాల్సిన సమాచారం రాలేదని సిట్ భావించాల్సి వచ్చింది. ఇదిలావుండగా తెలంగాణాలో ఓటుకు కోట్లు కుంభకోణం కేసులో నాలుగో నిందితుడైన జెరూసలేం మత్తయ్య కాల్‌డేటాకు కంపెనీల ప్రొవైడర్లను అడిగేందుకు అనుమతి కోరుతూ ఏపి సిబిసిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.