S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చడం కష్టం కాదు

ఏలూరు, డిసెంబర్ 1 : ఎయిడ్స్ సోకేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని సమాజంలో అందరి భాగస్వామ్యంతో ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం కష్టం కాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణా దినోత్సవ సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎయిడ్స్ ప్రచారర్యాలీని కలెక్టర్ గురువారం ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెరిగిందని దాని వలన ఎయిడ్స్ కారక క్రిముల వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని మంచి ఆహారం, మానసిక ధైర్యం కల్పిస్తే హెచ్‌ఐవి సోకిన బాధితులు 20 నుండి 25 ఏళ్లు అదనంగా జీవించవచ్చునని అందుకే హెచ్‌ఐవి బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు. జిల్లాలో హెచ్‌ఐవి బాధితులకు నిరంతరం మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు ఎఆర్‌టి సెంటర్లలో 34618 మంది అవసరమైన మందులు తీసుకుంటున్నారని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ ఒక దశాబ్ధకాలం నుండి హెచ్‌ఐవి బారిన పడినవారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని, రాబోయే రోజుల్లో ఎయిడ్స్ రహిత సమాజం ఆవిర్బవించి ప్రతీ మనిషీ ఆరోగ్యవంతంగా జీవించేలా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో పలురకాల వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, దీనివలన అనేక ముందుజాగ్రత్త చర్యలు వల్ల వ్యాధి సోకకుండా నివారించుకోగలుగుతామని చెప్పారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఎవరికి వారే స్వచ్ఛందంగా హెచ్ ఐవి పరీక్షలుచేయించుకునేలా ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని, తెలిసో తెలియకో తప్పు చేసిన వారు ఇకపై చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ సమాజంలో ప్రతీ మనిషీ నిబద్దతతో నడుచుకోవాలని హద్దుమీరి ప్రవర్తిస్తే జీవితాంతం బాదపడక తప్పదని, కావున క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. డి ఎంహెచ్ ఓ డాక్టర్ కె కోటేశ్వరి మాట్లాడుతూ ఎక్కువగా 25 నుండి 49 సంవత్సరాల లోపు వయస్సు గల వారు హెచ్ ఐవి బారిన పడుతున్నారని, కావున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నివారణ సాధ్యపడుతుందని చెప్పారు. జిల్లా వైద్య విధాన పరిషత్తు కో ఆర్డినేటరు డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 33.8 మిలియన్ల జనాభా హెచ్ ఐవి బారిన పడ్డారని దేశంలో 5.4 మిలియన్ల మంది ఈ వ్యాధికి గురికాగా అందులో 3.5 లోల మంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారని, పశ్చిమగోదావరి జిల్లాలో 58737 మంది హెచ్ ఐవి బాధితులు జీవిస్తున్నారని వారి పట్ల ఆదరణ చూపితే జీవన పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వై సాయి శ్రీకాంత్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేషన్ విప్ గూడవల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు పి పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.