S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎస్సీలను వర్గీకరించి న్యాయం చేయాలని ధర్నా

కాకినాడ, డిసెంబర్ 1: ఎస్సీలను వర్గీకరించి మాదిగ, ఉప కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ మాట్లాడుతూ ఎస్సీ కులాలను వర్గీకరించి అట్టడుగున ఉన్న వారికి రిజర్వేషన్లను అమలు తమ నాయకుడు మంద కృష్ణమాదిగ సుమారు 23 ఏళ్ళ నుండి పోరాటం సాగిస్తున్నారన్నారు. తమకు మద్దతు ఇచ్చిన బిజెపి నేతలు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయల దిష్టిబొమ్మలను మాల సోదరులు దగ్ధం చేయడం విచాకరమన్నారు. వర్గీకరిస్తే తమకు ఉంటామంటూ వెంకయ్య, దత్తాత్రేయల ఫొటోలకు వారు పాలాభిషేకం చేశారు.

దామాషా ప్రకారం రిజర్వేషన్లు పంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నాయకులు వల్లూరి సత్తిబాబు, పలివెల నవీన్, వంగలపూడి నూకరాజు, పువ్వల భాస్కరరావు, తుమ్మలపల్లి చిన్నా, బోనగిరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం
చింతూరు ఐటిడిఎ పిఒ చిన్నబాబు
కూనవరం, డిసెంబర్ 1: కొండరెడ్ల గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చింతూరు ఐటిడిఎ పిఒ చిన్నబాబు తెలిపారు. గురువారం కూనవరం మండలంలోని కొండలపై ఉన్న కారుమానుకొండ, గబ్బిలాలగొంది గ్రామాల్లో పిఒ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని కొండరెడ్లతో పిఒ సమావేశం ఏర్పాటుచేసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం అందడం లేదని పిఒ దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ శేషారెడ్డి, ఎంపిపి కొమరం పెంటయ్య, కూటూరు సర్పంచ్ సీతారామయ్య, ఎంపిడిఒ సత్యనారాయణమూర్తి, ఎఇలు రామారావు, రవి తదితరులు పాల్గొన్నారు.