S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెడికల్ సీట్లు యథాతథం

హైదరాబాద్, డిసెంబర్ 1: ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీ సీట్లలో కోత ఉండబోదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. ఎంసిఐ ఎత్తి చూపిన లోపాలన్నింటినీ సరిదిద్దుతామని, సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో చర్చించనున్నట్టు చెప్పారు. ఇటీవల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసి లోపాలు ఎత్తిచూపించి 150 సీట్లను తగ్గించాల్సి వస్తుందని ప్రకటించారు.
ఈ విషయమై మంత్రి లక్ష్మారెడ్డి సచివాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విద్యార్థుల నిష్పత్తికి సరిపడా భవనాలను సమకూర్చేందుకు, అధ్యాపక సిబ్బందిని నియమించేందుకు తక్షణం చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. నిర్మాణ పరమైన లోపాలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఔషధ సేవల వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను మంత్రి ఆదేశించారు. చాలినంతమంది అధ్యాపక సిబ్బంది ఉన్నప్పటికీ ఆకస్మిక తనిఖీల సమయంలో అందుబాటులో లేరని అధికారులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. అవసరమైతే సీట్ల విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ సీట్లు పోవని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని లక్ష్మారెడ్డి చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.