S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఔట్ సోర్సింగ్‌కు బాసట

హైదరాబాద్, డిసెంబర్ 1: విద్యుత్‌శాఖలోని ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను దశలవారీగా క్రమబద్ధీకరించే అవకాశాలను పరిశీలిస్తున్న దృష్ట్యా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపును ఉప సంహరించుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా తక్కువ జీతాలతో విద్యుత్ శాఖలో సేవలందిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మె పిలుపును వెంటనే ఉపసంహరించుకుని మంత్రి జగదీశ్‌రెడ్డితో శుక్రవారం చర్చలు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె పిలుపు నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో గురువారం సంబంధిత మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కోల సిఎండి డి ప్రభాకర్‌రావు, సెంట్రల్ డిస్కామ్ సిఎండి రఘుమారెడ్డి, నార్తర్న్ డిస్కామ్ సిఎండి గోపాల్‌రావు, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను జెన్కో సిఎండి ప్రభాకర్‌రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సబ్ స్టేషన్లు, లైన్లు, విద్యుత్ కేంద్రాలు, కార్యాలయాల నిర్వహణ వంటీ కీలక విభాగాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలందిస్తున్నారని, వీరు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేయగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లనుంచి తక్కువ జీతాలకే సేవలు అందిస్తూ ఎంతో అనుభవం గడించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అలాంటి ఉద్యోగుల వెతలను మానవతాదృక్పథంతో పరిశీలించి వారి సర్వీసులను దశలవారీగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ సమస్యనైనా చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు సమ్మెలు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాజకీయ కారణాలతో చేసే సమ్మెలో భాగస్వాములు కాకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సమ్మె పిలుపును ఉప సంహరించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. సమ్మె ఉప సంహరణ ప్రకటన చేసిన తర్వాత వెంటనే ఉద్యోగులను చర్చలకు పిలవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని ఆరోగ్యకరమైన తెలంగాణ తమ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.

చిత్రం..గురువారం అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కెసిఆర్