S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక నాణ్యమైన చేపల ఉత్పత్తి!

భీమవరం, డిసెంబర్ 3: అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ నాణ్యత లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ ఆక్వా ఉత్పత్తులను సంస్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతు న్నాయ. ఇప్పటికే యాంటీ బయోటిక్స్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించగా, తాజాగా పౌల్ట్రీ, కబేళా వ్యర్థాలను ఆక్వాసాగులో వినియోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో పనిచేసేలా మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశీయ ఆక్వా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండుంది. ముఖ్యంగా భారత్‌లో ఉత్పత్తిచేసిన రొయ్యలకు అమెరికా, జపాన్ వంటి దేశాల్లో మంచి ఆదరణ కనిపిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు సాగులో వినియోగిస్తున్న యాంటీ బయోటిక్స్ కారణంగా మన రొయ్యలను దాదాపు నిషేధించే పరిస్థితులు తలెత్తాయి. దేశం నుండి ఎగుమతి చేస్తున్న రొయ్యల్లో యాంటీ బయోటిక్స్ అవశేషాలు ఉంటున్నాయంటూ కొన్ని దేశాలు మన ఉత్పత్తులను వెనక్కి పంపుతున్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఆధ్వర్యంలో రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, కొన్ని రకాల యాంటీ బయోటిక్స్ వినియోగంపై ఆంక్షలు సైతం విధించింది. కాగా, ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆక్వాహబ్‌గా తీర్చిదిద్దాలని చంద్రబాబు సర్కారు చర్యలు చేపట్టింది.
రొయ్యలతోపాటు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల చేపలను విదేశాలకు సైతం ఎగుమతి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో చేపల పెంపకంలో పౌల్ట్రీ, కబేళా వ్యర్థాల వినియోగం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో నిషేధిత ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ సాగులో ఈ తరహా వ్యర్థాలను వినియోగించేవారు. క్యాట్ ఫిష్ పెంపకం నిషేధించిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ వ్యర్థాలను మామూలు చేపల పెంపకానికి కూడా వినియోగించడం మొదలయ్యింది. కోడిమాంసం దుకాణాల నుండి వచ్చే కోళ్ల పేగులు తదితర వ్యర్థాలు, కబేళాల్లో మిగిలిపోయే పశుమాంసం వ్యర్థాలను చేపలకు మేతగా వాడుతున్నారు. సాధారణంగా చేపలకు వేరుశెనగ చెక్క, తౌడు, మొక్క జొన్న వంటివి ఆహారంగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నూకలు ఉడికించిన అన్నం కూడా ఉపయోగిస్తుంటారు. అయితే చేప త్వరగా ఎదగాలన్న ఆతృతతో పలువురు రైతులు పౌల్ట్రీ, కబేళా వ్యర్థాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల చేప ఎదుగుదల బాగున్నప్పటికీ, కొన్ని రకాల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశముంది. అలాగే ముఖ్యంగా ఈ వ్యర్థాలు ఉపయోగించిన చెరువుల నీరు కారణంగా నీటి వనరులు, భూమి, వాతావరణం కాలుష్యం అవుతోంది. పట్టుబడి సమయంలో చెరువుల్లో నీటిని కాలువల్లోకి వదిలేస్తుండటంతో మంచినీటి వనరులన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. ఈ తరహా వ్యర్థాలు రాష్ట్రంతోపాటు సరిహద్దుల్లోని తెలంగాణ, తమిళనాడు, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్నాయి. దీనివల్ల ఎదురవుతున్న విపరిణామలను దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగులో ఈ వ్యర్థాల వినియోగాన్ని నిషేధించింది. ఈ మేరకు జిఒ 54ను విడుదల చేసింది. కాగా, వ్యర్థాల వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టడానికి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. తహసీల్దార్ చైర్మన్‌గా, విఆర్‌ఒ, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, పోలీసు శాఖ ఎస్‌హెచ్‌ఒ, మత్య్సశాఖ ఎఫ్‌డిఒ సభ్యులుగా కమిటీలు ఏర్పాటుచేస్తారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కాలుష్య నియంత్రణ మండలి, డిఎఫ్‌ఒ, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్టు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు ప్రతీ నెలా సమావేశమై నిషేధం అమలు తీరును సమీక్షిస్తారు. ఆక్వా సాగులో నిషేధిత వ్యర్థాలను వినియోగించే రైతులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.

చిత్రాలు..వ్యర్థాల వినియోగంతో కలుషితమైన చేపల చెరువు, అనారోగ్య మేతతో సైజు పెరిగిన చేపలు