S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెట్టుబడులకు స్వాగతం

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఢిల్లీలో హిందూస్తాన్ టైమ్స్ ఏర్పాటు చేసిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన అన్ని వనరులు, ఖనిజాలు ఉన్నాయి, స్నేహపూర్వక ప్రభుత్వం ఉన్నదని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరం 10.99 శాతం వృద్ధిరేటు సాధించిందని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలుండగా కొత్తగా అమరావతిని నిర్మించాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు బాబు బదులిస్తూ పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనతోపాటు అంతర్జాతీయ నగరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. హైదరాబాదు నగరాన్ని కూడా అదే లక్ష్యంతో విస్తరించినట్లు ఆయన చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూమిని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో తనకు విభేదాలు లేవంటూ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాను ఎల్లప్పుడు సిద్ధమేనన్నారు. ‘ప్రపంచ నీటి సంక్షోభం- పరిణామాలు’ అంశంపై చంద్రబాబు సదస్సులో ప్రసంగించారు. ‘కొత్త రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టి సారిస్తున్నాం. విద్యారంగానికీ పెద్దపీట వేస్తున్నాం. అమరావతిలో పలు విశ్వవిద్యాలయాల స్థాపన జరుగబోతోంది. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఐటి రంగంలో తాను చేసిన కృషి మూలంగా తెలుగు విద్యార్థులు ఈరోజు ప్రపంచమంతా ఉన్నారు. వర్షపు నీటిని నదులకు అనుసంధానం చేయటం ద్వారా నీటి కొరతను తీర్చే దిశగా కృషి చేస్తున్నాం. కొత్త రాష్ట్రంలో తొలి అర్థ సంవత్సరంలో 25.6 శాతం వ్యవసాయం అభివృద్ధి సాధించాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
సచిన్‌తో ముచ్చట్లు
నాయకత్వ సదస్సుకు హాజరైన ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. నెల్లూరు జిల్లాలో దత్తత తీసుకున్న కెపి కొండ్రిగ గ్రామాభివృద్ధికి తాను తీసుకుంటున్న చర్యల గురించి సచిన్ ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పాణిగరియాను కలుసుకుని వివిధ ప్రాజెక్టుల గురించి చర్చించారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను విస్తృతపరిచేందుకు తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను రూపొందించేందుకు ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన కమిటీకి చంద్రబాబు కన్వీనర్‌గా వ్యవహరించటం తెలిసిందే.

చిత్రం..ఢిల్లీలో శనివారం జరిగిన నాయకత్వ సదస్సులో సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడుతున్న చంద్రబాబు