S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నగదు కోసం అధికారుల నిర్బంధం

తాడికొండ, డిసెంబర్ 3: కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రజలు అనేక కష్టనష్టాలు పడుతున్నప్పటికీ బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయడం లేదని, ప్రతిరోజూ తమ పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ నగదు సక్రమంగా అందించటం లేదంటూ మండల పరిధిలోని పొనె్నకల్లు గ్రామస్తులు శనివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, సిబ్బందిని నిర్బంధించారు. బ్యాంక్‌కు తాళాలు వేసి, బ్యాంకు ముందే నిరసన తెలిపారు. ప్రతిరోజూ బ్యాంకుల చూట్టూ తిరగలేమని, తమ పనులు మానుకొని బ్యాంకులకు వస్తుంటే రోజుకు 2 వేల రూపాయులు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి పంటను అమ్ముకొని ఆ డబ్బు సైతం బ్యాంకులోనే డిపాజిట్ చేశామని, పనులకు వచ్చిన కూలీలు తమ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని, బ్యాంకులకు వస్తే డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని శంకర్‌రెడ్డి అనే రైతు బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగాడు. గ్రామస్తులంతా కలిసి అధికారులను నిర్బంధించారు. అనంతరం గ్రామపెద్దలు కలుగజేసుకొని బ్యాంకు మేనేజరు జి పద్మలతను సంప్రదించగా ఈరోజు 12 లక్షలు నగదు మాత్రమే వచ్చిందని తెలిపారు. గ్రామస్తులు అంగీకరిస్తే ఒక్కొక్కరికి 6వేల రూపాయల చొప్పున ఇస్తామని, లేకుంటే తాము చేయగలిగిందేమీ లేదని చెప్పారు. కొందరు తమకు రూ.10 వేల చొప్పున ఇస్తేనే తీసుకుంటామని వాదనకు దిగారు. చివరికి గ్రామస్తులంతా మాట్లాడుకొని వున్న మేరకు నగదు సమంగా ఇవ్వమని కోరడంతో బ్యాంకు అధికారులు రూ.6వేల చొప్పున అందజేశారు.

చిత్రం..గుంటూరు జిల్లా పొనె్నకల్లు ఎస్‌బిఐ బ్రాంచ్‌కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు