S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మా ‘బంగారు’ భవిష్యత్ ఏమిటి?

తిరుపతి, డిసెంబర్ 3: తమ బంగారు భవిష్యత్తు ఏమిటంటూ మహిళామణులు ప్రభుత్వ తీరుపై కనె్నర్ర చేశారు. శనివారం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మహిళామణులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా మహిళలు నిరసన వ్యక్తం చేశారు. బంగారు ఆభరణాల గురించి ఐటి అధికారులు లెక్కలు అడుగుతారని విస్తృత ప్రచారం జరిగిన విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో రాష్టవ్య్రాప్తంగా మహిళల్లో తమ వారసత్వపు ఆభరణాలు ఏమవుతాయోనని ఆందోళన నెలకొంది. ఈసందర్భంగా లక్ష్మీదేవి ఫొటోలు, వివిధ రకాల నినాదాల ప్లకార్డులు చేతపట్టుకుని పసుపుపుస్తెలను మెడలో ధరించిన మహిళలు నిరసన తెలిపారు. ఈసందర్భంగా భూమన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు తరువాత పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాజాగా బంగారంపై సైతం పన్నులు ఉంటాయని, పన్నులు చెల్లించాల్సిందేనని కేంద్రం నుంచి ప్రకటనలు వెలువడంతో మహిళల మనస్సు భగ్గుమందన్నారు. తాము పొదుపు చేసుకున్న డబ్బుతోను, తల్లిదండ్రులు తమకు వంశపారపర్యంగా ఇచ్చిన నగలను ఇప్పుడు కేంద్రం లాక్కుంటుందన్న ప్రచారంతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.

తిరుపతిలో వైకాపా ఆధ్వర్యంలో మహిళల ఆందోళన