S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంక్షేమ కార్యక్రమాలు పూర్తయ్యేట్టు చూడండి

శామీర్‌పేట, డిసెంబర్ 3: ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో పూర్తియేటట్లు చూడాలని మేడ్చల్ కలెక్టర్ ఎం.వి. రెడ్డి ఆదేశించారు. శనివారం తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎగ్జిక్యూటివ్ అధికారులు, గ్రామీణ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్పంచులతో తన చాంబర్‌లో కలెక్టర్ ఎం.వి.రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈసందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ గ్రామ స్థాయి అధికారులు తమ గ్రామంపై యుద్ధం ప్రకటించి త్వరితగతిన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, చెత్తడంపింగ్ ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో గ్రామాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఖచ్చితంగా ఈనెల 15న తేదీలోగా పూర్తి చేయాలని, హరితహారానికి సంబంధించి ఇప్పటికే నాటిన మొక్కలను జియోటాగింగ్ చేసి వాటిని సంరక్షించే బాధ్యత వచ్చే సంవత్సరానికి సంబంధించి మొక్కలు నాటే ప్రణాళిక ఉండాలని అన్నారు.
తాను ఎప్పుడు ఆకస్మిక తనిఖీ చేసినా నాటిన మొక్కల వివరాలు తనకు సమర్పించాలని, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఈనెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ పొడిగించామని అక్రమ లేవుట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులు ఇవ్వాలని అన్నారు. పన్నుల వసూలు కార్యక్రమాన్ని విజయవంతం చేయలేదని కేవలం 50 శాతం వరకు మాత్రమే చేశారని మిగితా 50 శాతం ఖచ్చితంగా వసూలు చేయాలని అధికారులకు కలెక్టర్ ఎం.వి. రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిపిఒ సురేష్ మోహన్, డిఆర్‌డిఎ పిడి పాల్గొన్నారు.

బ్లేడ్‌తో నర్సింగ్ విద్యార్థిని గొంతు కోసిన దుండగుడు
దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 3: ఓ యువకుడు బ్లేడుతో నర్సింగ్ విద్యార్థిని గొంతుకోసిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి కోహినూర్ గ్రామానికి చెందిన మమత (20) నర్సింగ్ చదువుతోంది. సంగారెడ్డి బుదేరా గ్రామానికి చెందిన రమేష్ ఓ కాలేజీలో బికామ్ చదువుతున్నాడు. ఇరువురూ ప్రేమించుకున్నారు. పెద్దలను సైతం లెక్కచేయకుండా ఈ ఏడాది జనవరి పదవ తేదీన ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లిని ఇరువర్గాల బంధువులు తప్పుబట్టారు. దీంతో పెద్దలు వీరిని విడదీశారు. అప్పటి నుంచి మమతపై రమేష్ కక్షను పెంచుకున్నాడు. తనను అంతమొందించడమే ధ్యేయంగా ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నాడు. ఎట్టకేలకు దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలో నివాసం ఉంటున్నట్టు సమాచారం తెలుసుకున్నాడు. కాలేజీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో కొత్తపేటలో మకాం వేసిన రమేష్ బ్లేడ్‌తో ఆమె గొంతుపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.