S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సెంచరీతో వార్నర్ విజృంభణ

మెల్బోర్న్, డిసెంబర్ 9: డేవిడ్ వార్నర్ విజృంభణ న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాకు 117 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సంపాదించిపెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రత్యర్థికి ఆసీస్ వైట్‌వాష్ వేయగలిగింది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి, మూడో వనే్డలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 264 పరుగులు సాధించింది. డేవిడ్ వార్నర్ 128 బంతులు ఎదుర్కొని, 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 156 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ సాంట్నర్, డి గ్రాండ్‌హోమ్ చెరి రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 36.1 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, టామ్ లాథమ్ 28 పరుగులు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో న్యూజిలాండ్‌కు పరాభవం తప్పలేదు. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు సాధించాడు. పాట్ కమిన్స్, జేమ్స్ ఫాల్క్‌నెర్, ట్రావిస్ హెడ్ తలా రెండేసి వికెట్లు తమతమ ఖాతాల్లో వేసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా డేవిడ్ వార్నర్ సొంతం చేసుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 (డేవిడ్ వార్నర్ 156, ట్రావిస్ హెడ్ 37, జార్జి బెయిలీ 23, ట్రెంట్ బౌల్ట్ 3/49, మిచెల్ సాంట్నర్ 2-43, డి గ్రాండ్‌హోమ్ 2/50).
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 36.1 ఓవర్లలో 147 ఆలౌట్ (మార్టిన్ గుప్టిల్ 34, టామ్ లాథమ్ 28, మిచెల్ స్టార్క్ 3/34, పాట్ కమిన్స్ 2/26, జేమ్స్ ఫాల్క్‌నెర్ 2/26, ట్రావిస్ హెడ్ 2/37).

చిత్రం..కివీస్‌ను ఓడించి సాధించిన వనే్డ ట్రోఫీతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్, డేవిడ్ వార్నర్