S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణలో ఆ ఒక్క కుటుంబంలోనే అభివృద్ధి

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కెసిఆర్ కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ విమర్శించారు. తెరాస పాలనలో తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల డిమాండ్ అర్థం చేసుకొని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ఓట్లు వేయకపోవడం దురదృష్టకరమని ఆజాద్ పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం తరఫున ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ఆధ్వర్వంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ వోరా తదితరులు హాజరయ్యారు.