S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇబ్బందుల్లో పేదలు

హైదరాబాద్, డిసెంబర్ 9:పెద్ద నోట్ల రద్దు వల్ల డబ్బున్న పెద్ద వాళ్లకే ఇబ్బందులు అని గ్రామీణ ప్రజలు తొలుత భావించారని, కానీ పెద్దలు బాగానే ఉన్నారు, కానీ సమస్యలన్నీ సామాన్యులకే కలుగుతున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం అయిన కరెన్సీ అందుబాటులో లేక పోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , ఆర్‌బిఐ దీనిపై దృష్టిసారించారని, డబ్బుల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. సికిందరాబాద్‌లోని కస్తుర్భా గాంధీ డిగ్రీ కాలేజీలో ఎలక్ట్రానిక్ లావాదేవీలపై అవగాహన కలిగించేందుకు సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఆరునెలల్లో డిజిటల్ ట్రాన్జాక్షన్ చేయాలని కేంద్రం చెబుతోంది, దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎలక్ట్రానిక్ లావాదేవీలపై విద్యార్థులు అవగాహన పొంది ఇంట్లో తల్లిదండ్రులు, చుట్టు పక్కల వారికి అవగాహన కలిగించాలని చెప్పారు.
అభివృద్ధి అంటే అద్దాలు మేడలు, ఔటర్ రింగురోడ్‌లు మాత్రమే కాదని, అట్టడుగున ఉన్న వారికి ఫలాలు అందడమే అభివృద్ధి అని అన్నారు. 70ఏళ్ల క్రితం డెవలప్‌మెంట్ విత్ ఈక్వల్ అని రాజ్యాంగంలో రాసుకున్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారు కానీ ఆ స్ఫూర్తి ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. పేదవారికి, ధనవంతులకు మధ్య అంతరం మరింతగా పెరిగిపోతోందని అన్నారు. ఒకవైపు ఐదువందల రూపాయల కోసం పరితపిస్తుంటే, మరోవైపు ఐదువందల కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకుంటున్నారని అన్నారు. సంపద కొద్దిమంది గుప్పిటలో ఉండడమే పేదరికానికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గమైన వ్యవస్థ ఎప్పటి వరకు పోదో అప్పటి వరకు పేదరికం పోదని, అందుకే ఈ వ్యవస్థను ధ్వంసం చేయాలని అన్నారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని సముద్ర సంపదను, భూ గర్భాన్ని కూడా దోచుకుంటున్నారని అలాంటి వారి సంపద కొల్లగొట్టాలని అప్పుడే పేదరికం పోతుందని అన్నారు.