S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సారీ.. సర్వర్ డౌన్!

హైదరాబాద్, డిసెంబర్ 9: బ్యాంకుల ముందు చాంతాడంతో క్యూలు కనిపిస్తుంటాయి. కానీ ఈ బ్యాంకు క్యూలో ఉన్నది కొద్ది మందే అని ఉత్సాహంగా వెళ్లిన వారికి నిరుత్సాహం తప్పడం లేదు. బ్యాంకుకు వెళ్లగానే సారీ సర్వర్ డౌన్.. ఎప్పుడైనా పని చేస్తుందనే నమ్మకంతో వీళ్లు క్యూలో నిలబడ్డారు. ఆసక్తి ఉంటే మీరూ నిలబడండి అనే సలహా వినిపిస్తోంది. ఇది అల్వాల్‌లోని ఎస్‌బిహెచ్ బ్యాంకు పరిస్థితి. గత రెండు రోజుల నుంచి ఎస్‌బిహెచ్‌తో పాటు పలు బ్యాంకుల్లో పరిస్థితి ఇలానే ఉంది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు, దానికి తోడు రెండు రోజుల నుంచి సర్వర్ డౌన్ అనే మాట వినిపిస్తోంది. చదువు రాని సామాన్యులు సైతం ఆన్‌లైన్ వ్యవహారాలు నేర్చుకోవాలని ఓవైపు ప్రభుత్వం చెబుతోంది. దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల్లో ప్రజలకు ఆన్‌లైన్ కార్యకలాపాలపై శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు మాత్రం నెట్ వర్క్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పలు బ్యాంకుల్లో సర్వర్ డౌన్ అనే మాట వినిపిస్తోంది. ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహించే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలోనే సర్వర్ డౌన్ అనే మాట వినిపిస్తే, ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోంది. సరైన ముందస్తు ఏర్పాట్లు లేకుండానే ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేయడం, అందరినీ బలవంతంగా ఆన్‌లైన్ బాట పట్టించడం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరడం మాట ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ఇబ్బందులు పాలవుతున్నారు. ఆన్‌లైన్‌కు బ్యాంకులను, వ్యవస్థలను సిద్ధం చేసి, ప్రజలను సన్నద్ధం చేయడం కన్నా ముందే కరెన్సీని రద్దు చేయడంతో సమస్యలు తప్పడం లేదు. సర్వర్ డౌన్ సమస్య హైదరాబాద్‌లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉంది.