S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నానక్‌రాంగూడ ఘటనకు కెటిఆర్‌దే బాధ్యత

హైదరాబాద్, డిసెంబర్ 9: నానక్‌రాంగూడలో అనుమతి లేకుండా ఏడు అంతస్తుల మేడ కూలిపోయిన ఘటనకు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేసి తన నైతికతను చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ 70వ జన్మదినం సందర్భంగా గాంధీ భవన్‌లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉన్నంత కాలం సోనియా గాంధీ పేరు ఉంటుందని అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు, పారదర్శక పాలనకు, జవాబుదారీతనానికి యుపిఎ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు సత్పలితాలు ఇచ్చాయని ఆయన తెలిపారు. ఆహార భద్రతా చట్టం, ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం లాంటి అనేక విప్లవాత్మక చట్టాలు తెచ్చిన ఘనత యుపిఎ చైర్ పర్సన్ సోనియాకే దక్కుతుందని అన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇటీవల రోడ్ల కుంభకోణంలో కోట్ల రూపాయలు బయటపడ్డాయని ఉత్తమ్ అన్నారు.
టి.పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ, అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులను కడిగి పారేస్తానని మంత్రి హరీశ్ రావు చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీని సజావుగా నడిపించి ప్రజా సమస్యలపై చర్చించి, ప్రతిపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉండగా, మంత్రి అలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఇంకా ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రులు దానం నాగేందర్, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

చిత్రం..ఉత్తమ్‌కుమార్ రెడ్డి