S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏబివిపి విద్యార్ధి ఉద్యమాలతో జెఎన్‌టియుహెచ్‌లో తగ్గిన ఫీజులు

హైదరాబాద్, డిసెంబర్ 9: జెఎన్‌టియు హైదరాబాద్ యూనివర్శిటీ ఎట్టకేలకు విద్యార్ధి ఉద్యమాలకు తలొగ్గి ఫీజులను తగ్గించింది. గతంలో 1520 రూపాయిలున్న ఫీజును 765 రూపాయిలకు తగ్గించారని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతకుంట సాయికుమార్ తెలిపారు. గత వారం రోజులుగా జెఎన్‌టియు సమస్యలపై విభిన్న రీతిలో ఉద్యమించడంతో యూనివర్శిటీ పాలనా యంత్రాంగం దిగివచ్చిందని అన్నారు. విసి ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ యాదయ్య, సిఇహెచ్ ప్రిన్సిపాల్ గోర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావులు విద్యార్ధుల సమస్యలను అర్ధం చేసుకున్నారని, ఫీజులను తగ్గించడంతో విద్యార్ధుల్లో ఆనందం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. గాయత్రీ హాస్టల్‌కు వైఫై కనెక్షన్, ప్రత్యేక భోజన గృహం, బాలిక హాస్టల్‌లో సరిపడా మంచాలు ఏర్పాటు చేయాలని అదే విధంగా వివిధ విభాగాల్లో నాణ్యమైన విద్యను అందించే విధంగా అందుబాటులో ఉపకరణాలను ఉంచాలని కోరినట్టు సాయి కుమార్ తెలిపారు.

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ ఢిల్లీలో మహాధర్నా
ఖైరతాబాద్, డిసెంబర్ 9: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నట్టు మాలమహానాడు ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని నాళ్లు అక్కడే మకాం వేసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాయకులు చెన్నయ్య, గైని గంగారామ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేపడితే 25 కోట్ల మంది దళితులు.. బిజెపికి తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. నవంబర్ 27న పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభ ధర్మయుద్ధ సభ కాదని, బిజెపి నేతల కనుసన్నల్లో జరిగిన అధర్మ యుద్ధ సభ అని విమర్శించారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న మంద కృష్ణకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వెంకయ్య నాయుడిని అంబేద్కర్‌తో పోల్చుతూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం, జాతీయ ఎస్సీ కమిషన్ సైతం తిరస్కరించిన వర్గీకరణను తాము చేస్తామని వెంకయ్య నాయుడు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళితులను విభజించే కుట్రలో భాగంగానే ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చారని దుయ్యబట్టారు.
పార్లమెంట్ సమావేశాలు జరిగే వరకు తమ నిరసనలను ఉద్ధృతంగా కొనసాగిస్తూనే మరో వైపు జాతీయ నేతలను కలిసి కుట్రలను భగ్నం చేయాలని విన్నవించనున్నట్టు చెప్పారు. సమావేశంలో జంగా శ్రీనివాస్, ఆగమయ్య, మల్లిఖార్జున్ రావు, రమేష్, రాంచందర్ పాల్గొన్నారు.