S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసి బస్సు

ఘట్‌కేసర్, డిసెంబర్ 9: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసి బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైద్రాబాద్-వరంగల్ జాతీయ రహదారి ఘట్‌కేసర్ మండలకేంద్రంలోని మాధవరెడ్డి ఫ్లైఓర్‌పై ఘట్‌కేసర్ నుండి బీబీనగర్ వైపువెళ్తున్న ద్విచక్రవాహనాన్ని భూపాలపల్లి నుండి హైద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఎరుకల నరేష్ (26), సంగీతం వీరేష్(24)లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు భువనగిరి, యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం జియాపల్లికి చెందినవారని, సంగీతం వీరేష్ లిఫ్ట్ మెకానిక్‌గా, ఎరుకల నరేష్ ఏటిఎం రిపేర్ పనులను నగరంలో చేస్తుంటారని పోలీసులు తెలిపారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు. మృతులు రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
కౌలు రైతులకు ఏప్రిల్, మే నెలల్లో కార్డులు

జిల్లా కలెక్టర్ దివ్య వెల్లడి
వికారాబాద్, డిసెంబర్ 9: కౌలు రైతులకు ఏప్రిల్, మే నెలల్లో కౌలు కార్డులను ఇవ్వడానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డి.దివ్య వెల్లడించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మార్కెటింగ్ శాఖలు, బ్యాంకు అధికారులతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను రైతులకు అందించడమే కాకుండా, సబ్సిడీలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతు కూలీలు, చిన్నపాటి రైతులతో పాటు మహిళా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలను చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. అడవి పందులు, కోతుల తమ పంటలను నష్టం చేస్తున్నాయని వీటి నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అటవీశాఖ అధికారులతో సలహాలు తీసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందకపోవడం, నకిలీ విత్తనాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సమావేశంలో రైతులు తెలపగా మార్కెట్‌లో రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు విక్రయిస్తున్న కంపెనీలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్, తాండూర్ సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డిఆర్‌డివో పిడబ్ల్యు జాన్సన్, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సంజయ్‌కుమార్, పశు సంవర్థక శాఖ అధికారి ఎంవి సుబ్బారావు, నీటిపారుల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.