S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్యూరోక్రాట్లు సమన్వయంతో పనిచేయాలి

హైదరాబాద్, డిసెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయడం, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేందుకు బ్యూరోక్రాట్లు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంశాఖ పూర్వ కార్యదర్శి పద్మనాభయ్య సూచించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించినట్లు కనపడుతోందని, ఎవరిపని వారు చేసుకుని పోతున్నారన్నారు. శుక్రవారం ఇక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐఎఎస్ అధికారుల జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, గతంలో ఐఎఎస్ అధికారులకు విశేషమైన అధికారాలు ఉండేవని, అలాగే సమష్టి భాగస్వామ్యంతో అధికారులు పనిచేసేవారన్నారు. ప్రస్తుతం అనేక కారణాల వల్ల ఐఎఎస్ అధికారుల అధికారాలు తగ్గాయని, వారి ప్రాధాన్యత తగ్గిందన్నారు. పౌర సమాజం, క్రియాశీలకంగా స్వచ్ఛందసేవా సంఘాలు వ్యవహరించడం, ప్రపంచ వ్యాప్తంగా పాలసీలను పరిశీలించే సంస్థల పరిశీలన పెరిగిందన్నారు. ఐఎఎస్ అధికారుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లోని అధికారులు ఎవరికి వారు గిరిగీసుకుని పనిచేసుకునే సంస్కృతిని మానివేసి ఇతర శాఖలతో కలిసి ప్రభుత్వ లక్ష్యాల అమలుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం వేగంగా మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో పాత రూల్స్‌కు కాలం చెల్లిందని, కొత్తగా ప్రభుత్వ మ్యానువల్స్‌ను రూపొందించుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో బ్యూరోక్రాట్లు ఉండాలన్నారు. మీడియాకు కూడా బ్యూరోక్రాట్లు అందుబాటులో ఉండాలని, దీని వల్ల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో లోపాలను తెలుసుకోవచ్చన్నారు. ఎంసిహెచ్‌ఆర్‌డి డైరెక్టర్ జనరల్ వినో కె అగర్వాల్ మాట్లాడుతూ బ్యూరోక్రాట్లకు విశేష అధికారాలు ఉంటాయనేది గతం అన్నారు. కలిసిమెలిసి పనిచేసే సంస్కృతిని పెంచుకోవాలన్నారు. ప్రలోభాలకు తావివ్వకుండా విధానాలకు కట్టుబడి ఉండాలన్నారు. జాయింట్ డైరెక్టర్ జనరల్ అనిత బాలకృష్ణ ఐఎఎస్ అధికారుల పనితీరు వివరాలను వెల్లడించారు. ఆర్షీ ఖోస్లా అనే ఐఎఎస్ అధికారికి డైరెక్టర్ జనరల్ బంగారు పతకాన్ని ప్రదానం చేశారు.

తెలంగాణ విద్యార్థుల ఉద్యమానికి డిసెంబర్ 9 అపురూప గుర్తు
హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ యువత, విద్యార్థులు అలుపెరగని పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన డిసెంబర్ 9 అపురూప గుర్తు అని టిజెఏసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం డిసెంబర్ 9 అనే అంశంపై సదస్సులో పాల్గొని ప్రసంగించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన రావడంలో విద్యార్థులు, పాత్రికేయులు కీలకమన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ పైశాచిక దాడులను విద్యార్థులు తిప్పికొట్టారని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ప్రతిపాదించిన పలు తీర్మానాలను సభికుల మధ్య ఆమోదించారు. డిఎస్సీ గ్రూపు-1, 2 నోటిఫికేషన్ విడుదల చేయాలని, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సంఘాల నేతలు చెరుకు సుధాకర్, బెల్లయ్య నాయక్, విమలక్క, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ పురుషోత్తం, పిట్టల రవీందర్, ఇందిర, శివకుమార్, చౌహాన్ పాల్గొన్నారు.