S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కేసిఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకుందాం

రాజేంద్రనగర్, డిసెంబర్ 9: ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణని కాపాడుకుందామని ప్రజలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ కృతజ్ఞత సభను మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ చౌరస్తాలో నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు దారమోని రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్యపెడుతూ కేసిఆర్ కుటుంబం కోట్లు కూడబెడుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెచ్చింది.. కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బంగారు తెలంగాణ పేరుతో నిలువునా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను కేసిఆర్ నుంచి కాపాడుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కి నష్టం వాటిల్లుతున్నా లెక్క చేయకుండా ప్రజల మనోభీష్టానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. సోనియాగాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని, కేసిఆర్ తెలంగాణను తాను తెచ్చానని ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. డబుల్ బెడ్‌రూం స్కీం కింద పేదలకు ఇళ్లు కట్టిస్తానని తెలిపిన కేసిఆర్.. రంగారెడ్డి జిల్లాలో 4.20 లక్షల దరఖాస్తులు వచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతుల రుణమాఫీ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతానని తెలిపిన కేసిఆర్.. ఏ ఒక్కటి సరిగ్గా చేయలేక పోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే వలసలు తగ్గుతాయనుకుంటే కేసీఆర్ పరిపాలన మరింత వలసలు పెరిగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఉపాధిహామీ, ఆహార భద్రత చట్టాలు తీసుకువస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారని మండిపడ్డారు. దీంతో వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని పలికి గద్దెనెక్కిన మాటల మాంత్రికుడు కేసిఆర్ అన్నారు. ఒకే కుటుంబానికి నలుగురు వ్యక్తులు రాష్ట్రంలో నాలుగు స్తంభాల ఆట ఆడుతూ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇఎన్ అశోక్ కుమార్, సంరెడ్డి ప్రమోద్‌రెడ్డి, సానెం శ్రీనివాస్‌గౌడ్, మస్న వెంకటేష్, నోముల రాముయాదవ్, అబ్దేషి సదాలక్ష్మి, సోమ శ్రీనివాస్‌గుప్త, విజయలక్ష్మి, నరేష్, ప్రభాకర్‌రెడ్డి, ధనుంజయ్, అరుణ్ ముదిరాజ్, శ్రీకాంత్‌రెడ్డి, అరవింద్ సాగర్ పాల్గొన్నారు. అంతకు ముందు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికి పంచుకున్నారు.

ఉరేసుకుని రైతు ఆత్మహత్య
పరిగి, డిసెంబర్ 9: చెట్టుకు ఉరి వేసుకుని ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి ఎస్‌ఐ నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన అందేగల్ల కుర్వశీను (26) శుక్రవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వచ్చాడు. 7గంటల ప్రాంతంలో కుర్వ శీను పొలం పక్కనుంచి ఆదే గ్రామానికి చెందిన వెంకటయ్య వెళ్తుండగా, శీను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. వెంకటయ్య విషయాన్ని కుటుంబ సబ్యులకు తెలిపాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న అందేగల్ల శీను కుటుంబాన్ని పరిగి శాసనసభ్యుడు రాంమోహన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రి దగ్గర మృతుడి తండ్రి భార్యతో ఎమ్మెల్యే మాట్లాడారు. జరిగిన వివరాలు అడిగి తెలసుకున్నారు. అయిదు వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందచేశారు. రైతులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోరాదని కోరారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వలన వారి కుటుంబాలు రోడ్డుపాలు అవుతాయని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల్ నారాయణ రెడ్డి, ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఆనెం ఆంజనేయులు పాల్గొన్నారు.

రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అనవసర ఆరోపణలు

సికిందరాబాద్, డిసెంబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నగరంలో ఇళ్లు కూలిపోయిన సంఘటనలో ఎంతమంది రాజీనామాలు చేశారో ప్రజలు వివరించాలని తెరాస నాయకుడు ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ గురువారం నగరంలో భవంతి కూలిపోతే ఇద్దరు మంత్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. మంత్రి కెటిఆర్ సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారని తెలిపారు. ముఖ్యమంత్రి అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న తీరు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతుందని, ఈ విషయంలో మంత్రి కెటిఆర్ నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు చేపడుతున్నారని అన్నారు.
కానీ, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పిసిసి అధ్యక్షుడు సంఘటనా స్థలానికి వెళ్లి ఏకంగా మంత్రి కెటిఆర్‌ను రాజీనామా చేయాలని కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో మీరు చేసిన నిర్వాకాలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గాంధీభవన్ ప్రక్కన ఉన్న భీంరావుబాడను అర్థరాత్రి సాక్షాత్తూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రోడ్డున వేసిన సంఘటనలను మరిచిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో నగరంలో ఎన్నో ఇళ్లు పేకమేడల్లా కూలిపోయి ఎంతోమంది మరణించారని అన్నారు.
మరి ఆ సంఘటనల్లో ఎంతమంది మంత్రులు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారని, ఎంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నారో ఉదహరించి డిమాండ్ చేస్తే ఉత్తకుమార్‌రెడ్డికి హుందాగా ఉండేదని ఆనంద్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తూ అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తూ, ప్రపంచ దేశాల్లో తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్న యువమంత్రి కెటిఆర్‌ను రాజీనామా చేయమనడం కాంగ్రెస్ దివాళకోరుతనానికి నిదర్శనమని ఆనంద్ తెలిపారు.
పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. భీమ్‌రావుబాడ పేదల గురించి ఏమి సమాధానం చెబుతారని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి తెరాస ప్రభుత్వం నిరంతంరం అప్రమత్తంగా ఉందని అన్నారు.