S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీతిమంతుడు చంద్రబాబు

మచిలీపట్నం, డిసెంబర్ 9: ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు నిజాయితీని మరోసారి ప్రస్పుటం చేసిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు పట్ల శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే ఓటుకు నోటు కేసులో ఇరికించారన్నారు. అయితే చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును కొట్టి వేయడం నిజాయితీ గల నాయకులకు శుభ సూచికమన్నారు. ఎటువంటి మచ్చ లేని నాయకుడు చంద్రబాబు అన్నారు. ఆరోగ్యశ్రీ అమలుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేస్తున్న విమర్శలను కూడా అర్జునుడు తీవ్ర స్థాయిలో తిప్పి కొట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కార్పొరేట్ ఆస్పత్రులకు కల్పవృక్షంగా మారిందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ ఆస్పత్రుల అభ్యున్నతికి ఆరోగ్యశ్రీ పథకం ఉపయోగపడిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద మార్చి ఎంతో మంది పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు 23 జిల్లాల్లో ఈ పథకం కింద రూ.1361 కోట్లు ఖర్చు చేశారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో రూ.1860కోట్లు ఈ రెండున్నర యేళ్ళల్లో ఖర్చు చేయడం జరిగిందన్నారు. నాలుగు కోట్ల మంది లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది వైద్యులను నియమించామన్నారు. రానున్న జనవరి నుండి రూ.100లకే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ప్రజారోగ్యమే పరమవాదిగా పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై వైకాపా జిల్లా అధ్యక్షులు కెపి సారథి చేసిన విమర్శలను కూడా అర్జునుడు ఖండించారు. పట్టిసీమ నీళ్ళతో వందల ఎకరాలు సాగు చేసుకున్న సారథి పోలవరంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా కార్యదర్శి పివి ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కెడిసిసి బ్యాంక్ సిఇఓ సుబ్రహ్మణ్యం
బాధ్యతల స్వీకరణ

మచిలీపట్నం, డిసెంబర్ 9: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా కెఎస్ సుబ్రహ్మణ్యం శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ముఖ్య కార్య నిర్వహణాధికారి తోట వీరబాబు గత నవంబర్ 31న పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో నాబార్డు కన్సల్టెన్సీ సర్వీస్‌లో పని చేస్తున్న కె సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం నియమించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కెడిసిసి బ్యాంక్ ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున రైతులకు రుణాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

‘ఆరోగ్యశ్రీ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం’
నందిగామ, డిసెంబర్ 9: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టి సమర్థవంతంగా నిర్వహించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నేడు చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ అమలులో చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయంతం చేసేందుకు నందిగామ నియోజకవర్గం నుండి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్య లో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. పార్టీ కార్యాలయం నుండి ప్రా రంభమైన వాహనాలకు ఆయన జండా ఊపి ప్రారంభించారు. నగర పంచాయతీ డిప్యూటి ప్లోర్ లీడర్ కత్రోజు శ్రీనివాసాచారి, కౌన్సిలర్‌లు విశ్వనాధపల్లి కృపారావు, ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు ఖలీల్ అహ్మద్ రజ్వీ, ర బ్బానీ, సుబానీ, ఖాలిక్, ఖాజా, నాయకులు పాములపాటి రమేష్, కుక్కల సత్యనారాయణ ప్రసాద్, గద్దె రమేష్, ఆవుల విజయ్, బేరోతుల బాబు, పరి మి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో
రైతులు అప్రమత్తంగా ఉండాలి
వ్యవసాయ శాఖ జెడి నరసింహరావు

మచిలీపట్నం, డిసెంబర్ 9: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు యు నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రైతులు పంట రక్షణ చర్యలు చేపట్టుకోవాలన్నారు. వరి కోతలను నిలుపుదల చేయాలన్నారు. పనల మీద ఉన్న పంటను కుప్పలు వేసి వాటిపై పరదాలు, టార్పాలిన్‌లు కప్పాలన్నారు. కోతకు సిద్ధంగా ఉండి పడిపోయిన పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా దారులు తీసుకోవాలని జెడి నరసింహరావు రైతులకు సూచించారు.