S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 9: మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ అన్నారు. ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక లేడియాంప్తిల్ మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ మానవ హక్కులను ఉల్లంఘించిన వారు శిక్షార్హులన్నారు. మానవ హక్కులు ఉల్లంఘన జరిగిన సమయంలో మేధావులు, విద్యావంతులు ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మానవ హక్కుల పరిరక్షణపై విద్యార్థులు చేపట్టిన అవగాహనా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, ప్రిన్సిపాల్ తలశిల దామోదర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రామ్ అధికారి లంకిశెట్టి హరనాధ్, అధ్యాపకుల సంఘం కార్యదర్శి వై రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.