S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యార్ధులు అన్ని రంగాలలో రాణించాలి

పటమట, డిసెంబర్ 9: విద్యార్ధులు కేవలం చదువులకే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలని అనంతపురం జిల్లా కలెక్టర్, లయోలా పూర్వ విద్యార్థి కోనా శశిధర అన్నారు. శుక్రవారం ఉదయం కళాశాల ఆడిటోరియంలో ఆంధ్ర లయోలా కళాశాల వ్యవస్థాపక దినోత్సవం, స్ఫూర్తి ఉత్సవాలు, విభిన్న సంస్కృతుల మేళవింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి. సంప్రదాయలను ప్రపంచదేశాలు ఎంతో గౌరవిస్తాయన్నారు. విద్యార్ధులు సమాజంలోని మార్పులకు అనుగుణంగా మారుతు పేద ప్రజలకు సేవలందించాలని కోరారు. అనంతరం విద్యార్ధునులు వివిధ రచులతో కూడిన పసందైన వంటకాలు తయారు చేసి స్టాల్స్ ప్రదర్శించి అహుతులకు రుచి చూపించారు. ఆహా ఏమి రుచి అంటూ ఉపాధ్యాయులు విద్యార్ధులు ఆరగించారు. విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి. విద్యార్ధులు భారతీ సంప్రదాయ దుస్తులతో ముస్తాబై వేదిక వయ్యారాలు ఒలకబోస్తు నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల రెక్టర్ ఫాదర్ దూసి రవిశేఖర్, ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్, కరస్పాడెంట్ ఫాదర్ ఎస్.రాజు, వైస్ ప్రిన్సిపాల్స్ ఫాదర్ మెల్కియర్, గుమ్మాసాంబశివరావు, డీన్స్ బి.శ్యామ్‌సుందర్, బి.వెంకటేశ్వరరావు, బి.రాజు, మిస్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత చెల్లింపులపై
అవగాహనకు ప్రత్యేక చర్యలు
* డివిజన్ల వారీగా టీమ్‌ల ఏర్పాటు
* విఎంసి అదనపు కమిషనర్ అరుణ్‌బాబు
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 9: నగదు రహిత చెల్లింపులపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని విఎంసి అదనపు కమిషనర్ పి అరుణ్‌బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేకంగా నియమించిన టీమ్ సభ్యుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇందుకు డివిజన్ల వారీగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేస్తున్నామని, ఈ టీమ్‌లలో స్మార్ట్‌వార్డ్ స్పెషల్ ఆఫీసర్లను టీమ్‌లీడర్‌గా నియమిస్తూ జన్మభూమి కమిటీ సభ్యులు స్వయం సహాయక సంఘాల సభ్యులు బిల్ కలెక్టర్లు, రేషన్ షాపు డీలర్లు, డివిజన్ పరిధిలోని బ్యాంకు మేనేజర్లు, విఎంసి ఉపాధ్యాయులు, విద్యార్థులను స్మార్ట్‌వార్డ్ సెక్టార్ పార్ట్‌నర్ సభ్యులుగా ఉంటారన్నారు. యుసిడి పివో ఎంవివి సత్యనారాయణ, మాట్లాడుతూ టీమ్ సభ్యులందరూ తమ తమ డివిజన్లలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ఆయా సమస్యలను సేకరించడంతోపాటు నగదు రహిత చెల్లింపులపై అవగాహన చేస్తారన్నారు. ప్రజలందరికీ బ్యాంక్ ఎకౌంట్లు కలిగివుండేలా చర్యలు తీసుకొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి నగదును నేరుగా వారి అకౌంట్లలను జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తారన్నారు. ప్రతి ఎకౌంట్‌ను ఆధార్ అనుసంధానం చేయడం వలన ఎటిఎం, క్రెడిట్, రూపే కార్డులను అందుబాటులోకి తెస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రక్రియలపై టీమ్ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసారు. ఈకార్యక్రమంలో సిఎంహెచ్‌ఓ గోపినాయక్, సిటీప్లానర్ బి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.