S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నోట్ల కోసం ఖాతాదారుల పాట్లు

రేణిగుంట/్భమవరం, డిసెంబర్ 9: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులపై ఖాతాదారులు ఎదురు తిరిగిన సంఘటన శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది. రేణిగుంట ఎస్‌బిఐలో ఉదయం 7 గంటల నుంచి తమ డబ్బులు డ్రా చేసుకోడానికి ఖాతాదారులు వేచి ఉన్నారు. అయితే ఉదయం 10 గంటలకు బ్యాంకు లావాదేవీలు కొనసాగుతుండగా అప్పటికే బ్యాంకులో డబ్బులు అయిపోయినట్లు ఖాతాదారులకు బ్యాంకు అధికారులు తెలపడంతో ఒక్కసారిగా డబ్బు డ్రా చేసేందుకు వచ్చిన ఖాతాదారులు అధికారులపై ఎదురు తిరిగారు. గడిచిన మూడు రోజులుగా తాము బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవడానికి వస్తుండగా ప్రతి రోజు డబ్బు అయిపోయిందని సమాధానమిస్తున్నారని, అత్యవసర పరిస్థితులకు గాను ఉదయం 7 గంటల నుంచి బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తే బ్యాంకు తెరిచిన 10 నిమిషాల్లో డబ్బు అయిపోయిందని చెప్పడం ఏమిటంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సమయంలో బ్యాంకులోని ఖాతాదారులను కట్టడి చేసేందుకు బ్యాంకు సిబ్బంది సమాధానం చెప్పకపోవడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. బ్యాంకు వద్ద ఉన్న పోలీసు కానిస్టేబుల్ సాయంతో ఖాతాదారులను బ్యాంకు బయటకు పంపి గేట్లు వేయడంతో బ్యాంకు సిబ్బందిపై ఖాతాదారులు తిట్ల దండకం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శాపనార్థాలు పెట్టారు. అప్పటికే ఎస్‌ఐ శ్రీనివాసులు ఖాతాదారులను శాంతింపచేశారు. ఏదేమైనప్పటికీ గడిచిన వారం రోజులుగా బ్యాంకులు తెరచిన 10 నుంచి 20 నిముషాల్లోనే బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం అయిందని చెప్తున్నారు. దాంతో ఖాతాదారులు సహనం కోల్పోతున్నారు. రోజుల తరబడి బ్యాంకు వద్దకు డబ్బు డ్రా చేసుకునేందుకు పనులు మానుకొని బ్యాంకుల వద్ద ప్రజలు కాపలా కాసే పరిస్థితి నెలకొంది.
పోస్ట్ఫాసులకూ కరెన్సీ కష్టాలు!
మరోపక్క పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎదురవుతున్న కరెన్సీ కష్టాలు పోస్ట్ఫాసులను సైతం వీడటంలేదు. ఇటీవలి కాలంలో పోస్ట్ఫాసులను సైతం బ్యాంకుల తరహాలో తీర్చిదిద్దడంతో ఖాతాదార్ల సంఖ్య భారీగానే పెరిగింది. అయితే కరెన్సీ సంక్షోభంలో భాగంగా పోస్ట్ఫాసులకు నగదు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఖాతాదార్లకు చెల్లింపులు చేయలేక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. పోస్టల్ ఖాతాల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని టాప్-10లో స్థానం సంపాదించింది. రాష్ట్రంలో 59 హెడ్ పోస్ట్ఫాసులు, 1525 సబ్-పోస్ట్ఫాసులు, 8739 బ్రాంచి పోస్ట్ఫాసులున్నాయి. వీటిలో సుమారు 80 శాతం తపాలా కార్యాలయాలకు కరెన్సీ అందడంలేదని సమాచారం. ఖాతాదార్లకు చెల్లింపుల్లో భాగంగా తమకు అవసరమైన రోజువారీ నగదు కోసం పోస్టల్ సిబ్బంది భారతీయ స్టేట్ బ్యాంకుపై ఆధారపడుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా పోస్టల్ సిబ్బంది నగదు కోసం బ్యాంకుకు వెళ్లడం, అక్కడ అధికార్లు ‘నో క్యాష్’ అని సమాధానం చెబుతుండటంతో రిక్తహస్తాలతో వెనుతిరుగుతున్నారు. ప్రారంభంలో కొద్ది మొత్తంలో కరెన్సీ ఇవ్వడంతో, వచ్చిన ఖాతాదార్లకు కొంచెం కొంచెంగా పంపిణీచేసేవారు. రోజూ బ్యాంకుకు వెళ్లి, నగదు తీసుకువచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. దీనితో సుమారు 12 గంటల వరకు పోస్ట్ఫాసుల్లో ఖాతాదార్లు బారులు తీరి ఉంటున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా పూర్తిగా నగదు సరఫరా నిలిపివేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. నగదు కోసం వచ్చే ఖాతాదార్లకు సమాధానం చెప్పలేక పోస్టల్ సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. క్యూలో నిలబడినా సొమ్ము ఇవ్వకపోవడంతో ఖాతాదారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పలువురు ఖాతాదార్లు తమ ఖాతా పుస్తకాల్లో విత్‌డ్రా ఫారాలు ఉంచి తపాలా కార్యాలయాల్లో పెట్టుకుని వెళ్తున్నారు. నగదు రాకపోవడంతో తపాలా కార్యాలయాల్లో ఈ విత్ డ్రా పుస్తకాలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పోస్టల్ కార్యాలయాలకు నగదు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.