S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏపికి మరో వంద కోట్ల చిల్లర నోట్లు వస్తున్నాయి!

విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల మేరకు చిన్న నోట్లను ఒకటి, రెండు రోజుల్లో సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిఖ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేఖరులతో శుక్రవారం మాట్లాడుతూ 50, 100, 500 నోట్లు మాత్రమే ఇందులో ఉంటాయని తెలిపారు. దీని వల్ల జిల్లాల్లో చిల్లర నోట్ల సమస్య చాలా వరకూ తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ ప్రత్యేకంగా ఈ మేరకు కొంత నగదును పంపనుందన్నారు. రాష్ట్రంలో నగదు కొరత సమస్య ఉన్నప్పటికీ, ఆర్‌బిఐని సమన్వయం చేసుకుంటూ ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్య ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిరంతరం ఈ అంశంపై పర్యవేక్షిస్తుండటం వల్ల పూర్తిగా సమస్య పరిష్కారం కాకపోయినా, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడినట్లు సమాచారం లేదన్నారు. భారీ క్యూలైన్లు కూడా తగ్గాయన్నారు. పెట్రోల్ బంక్‌లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద పెద్దగా సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు లేవన్నారు. ఉన్న నగదు సక్రమంగా వినియోగించుకుంటూనే నగదు రహిత లావాదేవీలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. చాలా మంది నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు ముందుకు వస్తున్నారన్నారు. అన్ని రకాల బ్యాంక్ యాప్‌లు, వ్యాలెట్లను కలిపి ఎపి పర్స్ అన్న యాప్‌ను రూపొందించామన్నారు.