S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కల్తీపై మరింత కఠినం

విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్రంలో కల్తీకి పాల్పడుతున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కల్తీ వ్యాపారులను హెచ్చరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ శామ్యూల్ ఆనంద ఆధ్వర్యంలో ఆహార కల్తీ నియంత్రణ విభాగం, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కల్తీకారం వ్యాపారులపై దాడులు నిర్వహించామన్నారు. గడిచిన నెల రోజులుగా విస్తృతంగా కారంపొడి గోదాములు, ఉత్పత్తిదారులు, విక్రయ కేంద్రాలపై ఏపి ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారుల చేపట్టిన మెరుపుదాడులతో దిగ్బ్రాంతి కరమైన సమాచారం వెల్లడైందన్నారు. 50 కారం పొడి ఉత్పత్తి సంస్ధలపై దాడిచేసి 39 నమూనాలను సేకరించినట్లు మంత్రి తెలిపారు. మసాలపొడి, బోగస్ బ్రాండింగ్‌తో తయారవుతున్న కారంపొడి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించమన్నారు. ఏపిలోని 13 జిల్లాల్లో ప్రత్యేక దాడుల పరంపర కొనసాగుతుందన్నారు. 71 శీతల గిడ్డంగుల నుంచి 6 లక్షల 82 వేల 250 కిలోల మొత్తంలో చైనా కారంపొడి, కల్తీ కారం పొడి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షల కిలోల పైచిలుకు నకిలీ, కల్తీ, నాణ్యతలేని కారంపొడిని సీజ్ చేశామన్నారు. కల్తీకి చెక్కుపెట్టేందుకు త్వరలో మరింత మందిని ఫుడ్ ఇన్స్‌పెక్టర్లను నియమిస్తామని చెప్పారు.