S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రక్తదానం.. మహాదానం..!

సుల్తానాబాద్, డిసెంబర్ 9: అన్ని దానాల్లోకన్నా రక్తదానం మహాదానమని, రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడినవారవుతారని పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10వ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కాసుల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని జ్యోతిప్రజ్వలన చేసి జెసి ప్రారంభించారు. బ్యాంక్ ఖాతాదారులు 24 మంది రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం నిర్వహించిన బ్రాంచ్ మేనేజర్ ముకుందరెడ్డిని జెసి అభినందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ అంబటి రజిత, సర్పంచ్ అంతటి అన్నయ్య, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు సూర శ్యాం, లయన్స్ క్లబ్‌ల అధ్యక్షులు కడారి అశోక్‌రావు, ధీకొండ భూమేష్, వల్స నీలయ్య, జూలూరి అశో క్, బ్యాంక్ ఉద్యోగులు యాదగిరి, శ్రీనివాస్, వెంకటేష్, శ్రీ్ధర్, సంతోష్, కరీంనగర్ సివిల్ ఆసుపత్రి బ్లడ్‌బ్యాంక్ డాక్టర్ పద్మజ బృందం పలువురు పాల్గొన్నారు.
ఎక్సైజ్ దాడులు... బెల్లం పానకం ధ్వంసం
సుల్తానాబాద్, డిసెంబర్ 9: మండల కేంద్రంలోని శాంతినగర్‌లో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 250 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, మూడు లీటర్ల నాటుసారాను స్వాధీనపర్చుకొన్నట్లు ఎస్‌ఐ విజేందర్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
12 నెమళ్లు మృతి
ఇల్లంతకుంట, డిసెంబర్ 9: మండలంలోని వంతడుపుల శివారులో ఓ రైతు ప త్తి చేనులో శుక్రవారం 12 నెమళ్లు మృతిచెందాయి. రైతు పత్తిచేనుకు మందు పి చికారీ చేయడంతో చేనులో ఉన్న విత్తనాలను నెమళ్లు తినడంతో పిచికారి చేసిన మందు ప్రభావంతో నెమళ్లు మృతిచెందాయిని భావిస్తున్నారు. సమాచారాన్ని గ్రా మస్థులు ఫారెస్ట్ అధికారులకు అందించారు.
అంబేద్కర్ అందరివాడు
చొప్పదండి, డిసెంబర్ 9: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి వారోత్సవాల్లో భా గంగా బిజెపి రాష్టశ్రాఖ పిలుపుమేరకు గ్రామగ్రామాన సామాజిక సమరసత వా రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కొలిమికుంట గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు చేపూరి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా వచ్చి మాట్లాడారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేసిన అంబేద్కర్ సేవల ను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను గత పాలకుల నిర్లక్ష్యంవల్లే ప్రజల్లో కి తీసుకెళ్లలేకపోయారని, అందుకే బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సత్యనారాయణతోపాటు ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ ఒల్లాజి వెంకటస్వామి, అజయ్, మాచర్ల శశికుమార్, లంక శ్రవణ్‌కుమార్, తాడూరి రామకృష్ణ, రాజన్నల తిరుపతి, సాయికిరణ్, కాంతం ఉమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
16 మందిపై రౌడీషీట్ ఓపెన్
వీణవంక, డిసెంబర్ 9: వీణవంక మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు దోపిడీలు, అరాచకాలు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే కారణంతో 16 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు జమ్మికుంట గ్రామీణ సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ దామోదర్‌రెడ్డిలు శుక్రవారం తెలిపారు. మండలంలోని చల్లూరుకు చెందిన అబ్దుల్ షకీల్, గాజుల శ్రావణ్, గూడెపు బాలయ్య, నారాయణదాసు హరీష్, నల్లవెల్లి అనీల్, కొమ్ము అనీల్, కొమ్ము సల్మాన్, వీణవంకకు చెందిన గె ల్లు నాగరాజు, మల్లారెడ్డిపల్లికి చెందిన దూలం సమ్మయ్య, మామిడాలపల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్, రెడ్డిపల్లికి చెందిన అంబాల సంపత్, ఒడ్డెపల్లి కల్యాణ్, అజయ్, ముద్దం అంజయ్య, నర్సింగాపూర్‌కు చెందిన సింగిరెడ్డి నరోత్తంరెడ్డి, వుయ్యాల శ్రీనివాస్‌లు ఉన్నట్లు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించాలి
చందుర్తి, డిసెంబర్ 9: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద ధాన్యం విక్రయి ంచి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్ అన్నారు. మానాల గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయించాలన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ పీసరి తుకారం, వైస్ చైర్మన్ గట్ల మీనయ్య, నాయకులు లక్ష్మణ్, కమలాకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవి
* హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి

గంగాధర, డిసెంబర్ 9: భారతీయ సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర ఎం తో గొప్పదని, మన చరిత్ర సంస్కృతిని ఆచరించాలని జగత్‌గురు శంకరాచా ర్య, హంపీ విరూపాక్ష విద్యారణ్య పీ ఠాధిపతులు శ్రీశ్రీ విద్యారణ్య భారతీస్వామి పేర్కొన్నారు. గంగాధర మం డల కేంద్రంలో శ్రీ వీరభద్ర స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో శు క్రవారం ఆయన పాల్గొన్నారు. మహోత్సవంలో పాల్గొన్న భక్తులనుద్ధేశించి మాట్లాడుతూ పాశ్ఛాత్య సంస్కృతి, సా ంప్రదాయాలకు పోకుండా భారతీయ సంస్కృతిని ఆచరించడం ద్వారా మానవుడు ఎంతో ధన్యులవుతారన్నారు. వేల సంవత్సరాల చరిత్ర గలిగిన మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్య త మనేదన్నారు. ఈనెల 6 నుండి ప్రా రంభమైన వీరభద్రస్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవాలు చివరిరోజున ఘనం గా ముగిసాయి. రేవతి నక్ష్ర యుక్త ధనుర్‌లగ్నంనందు యంత్ర స్థాపన, మూర్తి ప్రతిష్ట, బింభీ శోధనము, ప్రాణప్రతిష్ట, నేత్రోనే్మళనము, దృష్టి కుంభం, శేష హోం, బలిదాన పూర్వక పూర్ణాహుతి కలశ ఉద్వాసన, కుంభ ప్రోక్షణ, మహాదాశ్వీరచనము ఆచార్య రుత్విక్ సన్మాన కార్యక్రమాలను నిర్వహించా రు. నంబి వేణుగోపాలచార్య, కౌశిక్ ఆ ధ్వర్యంలో ప్రాణాచార్యులు సముద్రాల శ్యాం సుందరచార్యులు, వివిధ ఆలయాలకు చెందిన ఆచార్యులు తిరుసఇథర ప్రతిష్ట కార్యక్రమ హోత్సవంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్ వైద భూపతి, స్థానిక సర్పంచ్ వైద రామానుజం, మా జీ సర్పంచ్ తాళ్ల అంజయ్య, ఉపసర్పంచ్ మడ్లపల్లి అంజయ్య, ఆలయ అ భివృద్ధి కమిటి సభ్యులు, గ్రామ ప్రజల తోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిష్టాత్సవాలన్ని తిలకించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమంతోపాటు తాగునీటి వసతిని కల్పించారు.

బీడు పొలాలను సస్యశ్యామలం చేస్తాం
* యాసంగి పంటకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే సతీష్

కోహెడ, డిసెంబర్ 9: సాగునీటి రం గానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీడు భూముల్ని సస్యశ్యామలం చేసి రైతు కళ్లల్లో ఆనందాన్ని ని ంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ అనా నరు. మండలంలోని శనిగరం ప్రాజెక్టు నుండి ఆయకట్టు గ్రామాలైన 11 గ్రామాల్లోని సుమారు ఐదు వేల ఎకరాలకు యాసంగి పంట నీరు విడుదల చేసేందుకు శుక్రవారం ఆయన హాజరై నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్సీ పా తూరి సుధాకర్‌రెడ్డితో కలిసి ప్రాజెక్టు ను సందర్శించారు. ప్రాజెక్టు కింది చివ రి భూములకు సైతం నీరు అందేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే రూ. 25 కోట్లతో త్వరలో ప్రా జెక్టు పునరుద్ధరణ పనులను చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి స్వా మి, జడ్పీటిసి లక్ష్మయ్య, టిఆర్‌ఎస్ నాయకులు శ్రీహరి, మహేందర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌లో చోరీ
* కుటుంబ సభ్యులు జైల్లో.. * ఇంట్లో చోరీ... * హుజూరాబాద్‌లో సంచలనం
హుజూరాబాద్, డిసెంబర్ 9: హు జూరాబాద్ పట్టణంలో ఓ ఇంట్లో చోరీ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజూరాబాద్ పట్టణానికి చెందిన వ రంగల్‌రోడ్డులో నివాసముండే పొట్టబత్తిని భరత్ అనేవ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఐదు తులాల బంగారం, కిలోన్నర వెండి, పదివేల రూపాయల నగదు, మూడు పాస్ పు స్తకాలు ఎత్తుకెళ్లారు. ఈవిషయమై భర త్ తల్లి సువర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్దిరోజులక్రితం భరత్ భా ర్య సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకుంది. దీనికి భర్త భరత్‌తోపాటు కుటుంబ సభ్యులు కారణమని ఆమె పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా భరత్‌తోపాటు ఆతని కుటుంబ సభ్యులను పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్ పంపించారు. వీరంతా ఇంటికి తాళం వేసి జైల్లోఉన్న సమయంలో చోరీ చో టుచేసుకుంది. శుక్రవారం జైలు నుండి బెయిల్‌పై వచ్చిన భరత్ తల్లి సువర్ణ ఇ ంటికి వెళ్లగా చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసి ంది. సిఐ వి.వి.రమణమూర్తి ఆధ్వర్య ంలో క్లూస్ టీంను రప్పించి విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యులు జైల్లో ఉన్న సమయంలో చోరీ జరగడం సంచలనం సృష్టించింది.

యువకున్ని చితకబాదిన ఎస్సై

జగిత్యాల, డిసెంబర్ 9: అకారణం గా ఎస్సై చితకబాదడంతో ఓ యువకు డు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. జగిత్యాలకు చెందిన జితేందర్ అనే యువకుడు గురువారం రాత్రి నిజామాబాద్ జిల్లా అర్మూర్‌కు వెల్లి జగిత్యాలకు చే రుకుని ఇంటికి వెల్తుండగా కొత్త బ స్టాండ్‌లో ఎస్సై రాజేశ్వర్‌రావు నిలిపి అకారణంగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చినట్లు బాధితుడు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జితేంద ర్ పట్టణంలోని ఎటిఎంలో అసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. రాత్రి ఎస్సై తీవ్రంగా చితకబాదడంతో కాళ్లు, చేతులు, పొట్ట, తొడలు కమిలిపోవడ ంతో శుక్రవారం ఉదయం అసుపత్రి లో చేర్చినట్లు వారు తెలిపారు. ఈ విషయమై సదరు ఎస్సై రాజేశ్వర్‌రావును వివరణ కోరగా రాత్రి డ్రంక్‌అండ్‌డ్రైవ్‌లో పట్టుబడి దురుసుగా మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఎస్సై చితకబాదడంతో శరీరంలోని అంతర్బాగంలోను తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు విలేకరులకు తెలిపారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను
నెరవేర్చిన సోనియా
* సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాల టౌన్, డిసెంబర్ 9: తెలంగాణ ప్రజల సుదీర్గ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ ఈప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవమని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శువ్రారం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక దేవిశ్రీ గార్డెన్స్‌లో కా ంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు రక్తదానం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ప్రజల స్వ రాష్ట్ర ఆకాంక్షను సోనియా గుర్తించి రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసినా, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకే సోనియా ప్రధాన్యత ఇచ్చారని తెలిపారు. స్వర్గీయ రాజీవ్‌గాంధీ మరణనంతరం క్లీష్ట పరిస్థిల్లో కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టిన సోనియాగాంధీకి రెండు సార్లు ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చిన తీసుకోకుండా అర్థికవేత్తకు ప్రధాని పదవిని కట్టబెట్టిన ధీర వనిత అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరుతుందని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీదే రాజ్యధికారమని అశభావం వ్యక్తం చేసారు.ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, ఎంపిపి గర్వందుల మానస, వైస్ చైర్మన్ మన్సూర్, నాయకులు కొత్తమోహన్, గిరి నాగభూషణం, ముస్కు ఎల్లారెడ్డి, రవిందర్‌రావు,గర్వందుల నరేశ్‌గౌడ్, రియాజ్ పాల్గోన్నారు.

అవినీతి కేసులో తహశీల్దార్‌కు జైలుశిక్ష
లీగల్ (కరీంనగర్), డిసెంబర్ 9: లంచం తీసుకుంటూ పట్టుబడిన తహశీల్దార్ కుమ్మరి బాలకిషన్‌కు సంవత్సరం జైలుశిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఎసిబి కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన బోడ భాస్కర్ పెదనాన్న బోడ నర్సయ్య, సుంకరి నౌకరి చేస్తూ 2008లో మరణించాడు. వారసత్వంగా సంక్రమించే సుంకరి నౌకరి కావాలని బోడ భాస్కర్ మహాముత్తారం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి తహశీల్దార్ కుమ్మరి బాలకిష న్(55) సదరు దరఖాస్తును తిరస్కరించాడు. రూ. 60 వేల లంచంతోపాటు బోడ నర్సయ్యకు సంబంధించిన భీమా డబ్బులు రూ. 45 వేలు ఇస్తేనే నౌకరి ఇస్తానని తెలిపాడు. అంతా డబ్బులు ఇవ్వలేనని తహశీల్దార్‌ను బతిమిలాడిన ఒప్పుకోలేదు. చివరికి 60 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. అందులో నుండి 10 వేల రూపాయలు కరీంనగర్‌లో ఇవ్వాలని తహశీల్దార్ కోరాడు. దీనిపై బోడ భాస్కర్ సంబంధిత ఎసిబి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను విన్నవించుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు పథకం ప్రకారం వల పన్ని తహశీల్దార్‌ను పట్టుకొన్నారు. అనంతరం అరెస్ట్‌చేసి కోర్టుకు పంపి చార్జిషీటు దాఖలు చేశారు. తగిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్‌రావు నిందితుడైన తహశీల్దార్ కుమ్మరి బాలకిషన్‌పై నేరం రుజువు కావడంతో ఏడాది జైలుశిక్షతోపాటు ఐదు వేల రూపాయలు జరిమాన విధిస్తూ తీ ర్పు చెప్పారు.