S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధే

నక్కలగుట్ట,డిసెంబర్ 9:తెలంగాణ రాష్ట్ర సాకారం చేసింది మహోన్నత నాయకురాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాందీనే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్వర్యంలో కృతజ్ఞతాదివస్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా ముందుగా నాయిని రాజేందర్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్‌లు కేక్ కట్ చేసి, సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నాయిని మాట్లాడుతూ దేశానికి ఒక దిశా నిర్దేశం చేయగల సామర్థ్యం ఉన్న నాయకురాలు సోనియా అని తెలిపారు. సెక్యులరిజం భావాలను దేశంలో పెంచి, సర్వమత సామరస్యానికి కృషి చేసిన నాయకురాలని, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, సమాచార హక్కు చట్టం లాంటి చట్టాలను తేవడంతో కీలకపాత్ర పోషించారని వివరించారు. గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే, తెరాస నాయకులు తామే తెచ్చామని చెపుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నమిండ్ల శ్రీనివాస్, ఇవి శ్రీనివాస్, శ్రీనివాసరావు, అయూబ్, విజయ్ పాల్గొన్నారు.

రెండో శనివారం సెలవు రద్దు
మహబూబాబాద్, డిసెంబర్ 9: మహబూబాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నవంబర్, డిసెంబర్ మాసాల్లో రెండో శనివారం సెలవులు రద్దు చేస్తున్నట్లు జిల్లా విధ్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి శుక్రవార ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో భారీగా కురిసిన వర్షాల మూలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి కలెక్టర్ రెండు రోజులు అత్యవసర సెలవులుగా ప్రకటించారన్నారు. అందుకోసం రెండవ శనివారం సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు. గార్ల, బయ్యారం మండలాల పాఠశాలలకు ఈ నిబందన నుండి మినహాయింపు ఉంటుందని తెలిపారు.