S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్రామీణ క్రీడలకు చేయూత నిస్తాం

నర్సంపేట, డిసెంబర్ 9: 62వ పాఠశాలల క్రీడా సమాఖ్య రాష్ట్ర స్థాయి కబడ్డీ ఎంపిక క్రీడోత్సవాలను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. నర్సంపేట పట్టణంలోని వల్లబ్‌నగర్ మినీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఎంపిక క్రీడా పోటీలు మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెల్సిందే. ఈక్రమంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించి ప్రసంగించారు. గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. చదువుతో పాటు ఆటపాటల్లో రాణించి క్రీడల్లో రాష్ట్రం పేరు ప్రఖ్యాతలను తీసుకరావల్సిందిగా కోరారు. క్రీడల వల్ల చురుకుదనం పెరుగుతుందని అన్నారు. క్రీడా సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఇవో నారాయణరెడ్డి, పాఠశాల ఆర్జేడి బాలయ్య, నర్సంపేట ఆర్డీవో రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

అవినీతిపై సమరశంఖం
2కె రన్ ప్రారంభించిన పరకాల ఏసిపి సుధీంద్ర
పరకాల, డిసెంబర్ 9: అవినీతిపై సమరశంఖం పూరించాలని పరకాల ఏసిపి సుధీంద్ర అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేఖ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎసిసి ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కాలేజి మైదానంలో వాకర్స్ సంఘాలు, వైఎసిసి సభ్యులు నిర్వహించిన 2కె రన్‌ను పరకాల ఏసిపి సుధీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశములో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. క్యాన్సర్ వ్యాధి కన్న అవినీతి ప్రమాదకరమన్నారు. దేశ అభివృద్ధికి అవినీతి గొడ్డలి పెట్టు అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎస్సై సుధాకర్, జెఎసి చైర్మన్ డాక్టర్ శ్రీనివాసాచారి, సహ చట్టం రక్షణ వేదిక ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ కామిడి సతీష్‌రెడ్డి, వైఎసిసి జిల్లా అధ్యక్షులు రాజేందర్ పాల్గొన్నారు.