S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు పట్టివేత

వరంగల్, డిసెంబర్ 9: వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇద్దరు నిందితులను వరంగల్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి 2.88లక్షల రూపాయల విలువచేసే 57గ్రాముల బం గారం, 1.230కేజీల వెండి నగలుల, ద్విచక్రవాహనంతోపాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సెంట్రల్ క్రైం ఇన్‌స్పెక్టర్ భీంశర్మ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణం వికాస్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎం.డి.ఖాజా, గడ్డం ప్రణయ్ చిన్ననాటి మిత్రులు. వీరిరువులు మటన్ షాపులో పనిచేస్తూ వచ్చే వేతనంతో మద్యం ఇతర వ్యసనాలకు ఖర్చు చేసేవారు. వ్యసనాలకు డబ్బు సరిపోకపోవటంతో నిందితులు ఇద్దరు కలిసి చోరీలకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు. వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో రాత్రి సమయంలో తాళాలు వేసి ఉన్న ఏడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఇందులో కమలాపూర్ పోలీ సు స్టేషన్ పరిధిలో నాలుగు, పరకాల పోలీసు స్టేషన్ పరిధిలో రెండు, మట్వాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక చోరీకి పాల్పడ్డారు. నిందితులు జల్సాల కోసం చోరీ చేసిన సొత్తును శుక్రవారం అమ్మేందుకు ద్విచక్రవాహనంపై పరకాల నుంచి అంబాల మీదుగా హన్మకొండకు బయలుదేరారు. క్రైం ఏసిపి ఈశ్వర్‌రావు ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ భీంశర్మ నగర శివారులోని ఎర్రగట్టుగుట్ట ప్రాంతంలోని వాహనాల తనిఖీ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి వద్ద బంగారు, వెండి ఆభరణా లు లభించాయి. దాంతో పోలీసులు వారిని ఇంటరాగేట్ చేయగా చోరీల విషయం బయటపడింది. నిం దితులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ భీంశర్మ తెలిపారు.