S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సక్రమంగా పనులు

వరంగల్, డిసెంబర్ 9: కేంద్రప్రభుత్వం వరంగల్ నగరాన్ని ఇప్పటికే అమృత్, స్మార్ట్‌సిటీ, హృదయ్, హెరిటేజీ పథకాల కింద ఎంపిక చేసి నిధు మంజూరు చేస్తోందని, రాష్ట్రప్రభుత్వం వరంగల్ నగరానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నగరాన్ని సందరంగా మార్చేందుకు, అభివృద్ధి పనులు సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమృత్ పథకంపై చర్చించేందుకు ఢిల్లీకి చెందిన కన్సల్టెంట్ బృందం శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో కలెక్టర్, పోలీసు కమీషనర్, వివిధ శాఖల అధికారులతో సమావేశమయింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం నగరంలో చేపట్టదలచిన వివిధ కార్యక్రమాల కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కన్సల్టెంట్ బృందానికి తెలియపరచింది. నగరపాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృద్ధి, జాతీయ రహదారుల విభాగం, రోడ్డు, భవనాల శాఖల సమన్వయంతో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తు స్టార్ట్ సిటీ పథకం కింద వివిధ శాఖలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ కేంద్రాలకు రూపకల్పన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే మంజూరైన ప్రత్యేక నిధులతో ఫాతిమానగర్, పెద్దమ్మగడ్డ, పోలీసు హెడ్‌క్వార్టర్స్ నుంచి హసన్‌పర్తి వరకు అత్యాధునిక హంగులతో రోడ్డును అభివృద్ధి చేసేందుకు, నగరంలోని 14 ప్రధాన కూడళ్లను విస్తరించటం ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఆయా శాఖల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. నగర పరిధిలోని 2500కిలో మీటర్ల విస్తీర్ణంలో రోడ్లు ఉన్నాయని, వీటిని దశల వారీగా అభివృద్ధి చేసేందుకు డిపిఆర్‌లను తయారు చేయాలని చెప్పారు. ప్రస్తుత 952కిలోమీటర్ల పైప్‌లైన్‌ను విలీన గ్రామాలకు పైప్‌లైన్‌ను అనుసంధానం చేస్తు మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.