అబ్బ.. ఎంత బాగుందో!
Published Sunday, 11 December 2016ఐస్ ముక్కను నాకుతూ చల్లదనాన్ని తన్మయత్వంతో ఆస్వాదిస్తున్న మర్కటం ముచ్చటగొలుపుతోంది కదూ!. మరోవైపు చేతిలోని ఆహారాన్ని మరో కోతి ఇష్టంగా తింటోంది కదూ! థాయ్‌లాండ్‌లో ఖేమెర శకం, అంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్లనాటి శిథిల ఆలయం ఫ్రాప్రంగ్ శమ్యాట్లో ఏటా కోతులకు భారీ విందు ఏర్పాటు చేస్తారు. దాదాపు 2వేల కిలోల పళ్లు, ఇతర తినుబండారాలు వాటికోసం అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇటీవలే అక్కడ నిర్వహించిన విందులో ఓ రెండు మర్కటాలు ఇలా కన్పించాయన్నమాట!