ఇవి ‘గబ్బిలం పూలు’!
Published Sunday, 11 December 2016సాధారణంగా పుష్పాలు తెలుపు సహా విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో కనిపిస్తాయి కదా!. కానీ ఇక్కడ కనిపిస్తున్న పూలు నల్లగా ఉన్నాయి కదూ!. 12 అంగుళాల వ్యాసార్థంతో ఉండే ఈ పూలకు 24 అంగుళాల పొడవుంటే మీసాల్లాండి కేసరాలు ప్రత్యేక ఆకర్షణ. వెడల్పుగా ఉంటే దళాలతో కన్పించే ఈ నల్లని పూలు గబ్బిలాల మాదిరిగా ఉండటం చేత వీటిని ‘బ్లాక్ బాట్ ఫ్లవర్’ అని పిలుస్తారు. వీటిలో తెల్లని రకమూ ఉన్నాయి. వాటిని వైట్‌బాట్ ఫ్లవర్ అని పిలుస్తారు. థాయ్‌లాండ్, మలేసియా, దక్షిణ చైనా, ప్రత్యేకించి యున్నన్ ప్రావిన్స్‌లో ఇవి పూస్తాయి.