S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ చేప విషం సైనైడ్ కన్నా ప్రమాదం

బంతిలా గుండ్రంగా కన్పిస్తున్న ఈ చేపలను ‘పఫర్’ ఫిష్ అంటారు. మామూలుగా ఉన్నప్పుడు సాధారణ చేపల్లానే కన్పిస్తాయి. కానీ ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు పొట్టలోకి గాలి లేదా నీటిని పీల్చి ఉబ్బిపోయి ఇలా గుండ్రంగా తయారవుతాయి. గ్లోబ్ ఫిష్, టోడ్ ఫిష్, బ్లోఫిష్, స్వెల్‌ఫిష్ ఇలా ఎన్నో పేర్లతో వీటిని పిలుస్తారు. ఇవి విషపూరితమైనవి. వీటిలో టెట్రోడొటొ అనే విషం ఉంటుంది. ఇది సైనైడ్ కన్నా ప్రమాదకరమైనది. ఒక చిన్న పఫర్‌ఫిష్‌లో ఉండే విషం 30మంది మనుషులను హతమార్చేంత ప్రభావం చూపిస్తుంది. వీటికి యాంటీడోట్ ఇంతవరకూ కనిపెట్టలేదు. కేవలం షార్క్ చేపలు మాత్రమే వీటిని తిని బతకగలవు. చైనా, కొరియా, జపాన్‌లలో ఈ చేపలను తింటారు. అయితే ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లు మాత్రమే వీటితో వంటలు చేస్తారు. చేపలను కోసి విషాన్ని తొలగించడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఇంతే సంగతులు. విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో ఇవి కన్పిస్తాయి. ఆ రంగుల్లో ఎంత మెరుపుంటే అంత తీవ్రంగా విషం ఉన్నట్లు లెక్క. అన్నట్లు చల్లటినీళ్లలో ఇవి మనలేవు. నున్నగా, బొద్దుగాను, ముళ్లతో కూడిన గ్లోబ్‌ల మాదిరిగానూ కూడా ఇవి కన్పిస్తాయి.

ఎస్.కె.కె.రవళి