ఇది ప్రేమేనా?
Published Sunday, 11 December 2016యన్నమలల్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సుప్రీమ్, పావని జంటగా కిషన్ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా’. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. హీరో సుప్రీమ్ మాట్లాడుతూ- ‘విచక్షణ’ అనే చిత్రంలో సెకెండ్ హీరోగా నటించానని, సోలో హీరోగా చేస్తోన్న తొలి చిత్రమని, అందరూ ఆదరించాలని అన్నారు. చిత్ర దర్శక నిర్మాత కిషన్ కన్నయ్య మాట్లాడుతూ ఇదొక యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అని, మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తిచేశామని అన్నారు. వరుణ్ అల్వా, వెంకట్, అప్పల నాయుడు, పెన్నా మోహన్ శర్మ, దివాకర్ శర్మ నటించిన ఈ చిత్రానికి సంగీతం:అనీష్ దర్బారి, నిర్మాత, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కిషన్ కన్నయ్య.