నాకౌట్స్ హీరో మూర్
Published Sunday, 11 December 2016బాక్సింగ్ బౌట్స్‌లో పోటీపడడం అంటేనే ప్రాణాలతో చెలగాటం ఆడడం. ప్రత్యర్థిని ఓడించడానికి ఎంతో ప్రతిభ ఉండాలి. తిరుగులేని నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇక నాకౌట్ విజయం కావాలంటే, అపారమైన శక్తిసామర్థ్యాలు అవసరం. తనతో సవాలు చేస్తూ రింగ్‌లోకి దిగిన బాక్సర్‌ను తిరిగి లేవకుండా మట్టికరిపించడమే నాకౌట్ విజయం. ఇలాంటి నాకౌట్స్‌లో ఆర్చీ మూర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతను ఏకంగా 141 బౌట్స్‌లో నాకౌట్ విజయాలను సాధించాడు.