మంచు కురిసే వేళలో...
Published Sunday, 25 December 2016శీతాకాలంలో మామూలు చలికే మనం గజగజ వణికిపోతాం. కానీ చైనాలోని సబ్ ఆర్కిటిక్ వాతావరణం ఉండే హిలాంగ్జియన్ ప్రావిన్స్‌లో ఒక్కోసారి ఉష్ణోగ్రత -32 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతూంటుంది. అక్కడి సరిహద్దుల్లో రక్షణ బాధ్యతలు చేపట్టే సైనిక సిబ్బంది జీవితం కత్తిమీద సామే. అక్కడ ప్రకృతే వారికి నిజమైన శత్రువు. ఊలుతో చేసిన ఎన్ని దుస్తులు వేసుకున్నా మంచుతో తడవాల్సిందే. వెన్నతిన్న శ్రీకృష్ణుడిలా మంచుతో తడిసిన టోపీలతో ఉన్న ఈ సైనికులను చూస్తే కొంతవరకైనా అర్థమవుతుంది...అక్కడి పరిస్థితి.