S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సునామీ.. సునామీ

21 మే 1960. ఉదయం ఐదుంపావు. చిలీలో ఆ సమయంలో తొమ్మిది అగ్నిపర్వతాలు పేలి సంభవించిన భూకంపంలో 1500 మంది మరణించారు. రెక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 8.5గా నమోదైంది. ఫలితంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ ఆరంభమైంది.
ఆ సునామీని 800 మైళ్ల దూరంలో ఉండగానే పసికట్టిన శాన్‌ఫ్రాన్సిస్కోలోని అమెరికన్ వాతావరణ సంస్థ వారు అది నాలుగు రోజుల తర్వాత 25 మే 1960న హవాయి తీరాన్ని తాకవచ్చని అంచనా వేశారు. వెంటనే ఆ సమాచారం ఆ తీరంలోని సివిల్ డిఫెన్స్ ఆఫీస్‌కి చేరవేశారు. వారు తక్షణ రక్షణ చర్యలని చేపట్టారు. అది తాకే తీర ప్రాంతంలోని వారిని ఖాళీ చేయించే ప్రక్రియని ఆరంభించారు.
ఆ సమయంలో హొనలూలూ తీరంలోని 169 ఈస్ట్ డ్రైవ్‌లోని నార్త్ ఇంట్లోని రేడియో సరిగ్గా పని చేయడంలేదు. ఆ ఉదయం అంతదాకా సంగీతం వినిపించాక సరిగ్గా ఆ సునామీ హెచ్చరిక వచ్చే సమయంలో రేడియో పలకడం మానేసింది. నార్త్ ట్రాన్సిస్టర్ దగ్గరికి వెళ్లి దాన్ని తడితే మళ్లీ రేడియో పలికేసరికి హెచ్చరిక ఆగిపోయి సంగీతం రాసాగింది. విసుగ్గా దాన్ని ఆపేసి ఏదో రోజు కొత్త రేడియోతో వస్తానని భార్య హెమెట్‌తో చెప్పాడు. మేఘావృతమైన ఆకాశాన్ని చూసిన నార్త్ ఆ రోజు పని ఎగ్గొట్టాలని అనుకున్నాడు.
పోలియో వ్యాధిగ్రస్థురాలై, కుర్చీకి పరిమితమైన హెమెట్ నార్త్‌ని బలవంతంగా ప్రాజెక్ట్ ఏరియాకి పంపింది. ఉదయం ఏడూ ఏభై ఆరుకి నార్త్ ఆఫీస్‌కి బయలుదేరాడు. అమెరికన్ వాతావరణ సంస్థ ఆ సునామీని రాడార్‌తో జాగ్రత్తగా పరిశీలిస్తూ అది మధ్యాహ్నం పనె్నండు గంటల ప్రాంతంలో తీరాన్ని తాకవచ్చని అంచనా వేశారు. ఉదయం తొమ్మిదికి అధికారులు హొనలూలూలో రేడియో ద్వారా సునామీ తాకిడి గురించి, లోతట్టులోని ఏ ప్రాంతాల వారు వెంటనే ఖాళీ చేయాలో ప్రకటించారు. ఆ తర్వాత ప్రతీ అరగంటకీ రేడియోలో ఆ హెచ్చరికని ప్రసారం చేస్తూనే ఉన్నారు. సునామీ రావడానికి పావుగంట ముందు సైరన్ మోగుతుందని కూడా ప్రకటించారు.
* * *
రేడియో పని చేయక హెమెట్ ఆ హెచ్చరికని విననట్లుగానే, చెవులు పని చేయని థామస్ పవర్స్ అనే రిటైర్డ్ ఎయిర్ కమాండర్ కూడా దాన్ని వినలేదు. హవాయి ద్వీపం తూర్పు తీరంలోని కయాలువా ప్రాంతం నించి ఆ సమయంలో కార్లో అతను పది మైళ్ల దూరంలోని హొనలులూకి మోర్గాన్ అనే ఓ బాల్య మిత్రుడ్ని కలవడానికి బయలుదేరాడు. థామస్‌కి హొనలులూ పరిచయం లేదు.
* * *
నేవీలో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పని చేసే నార్త్ దగ్గరికి ప్రాజెక్ట్ జీప్‌లో వచ్చిన ఓ కొలీగ్ రాబోయే సునామీ గురించి చెప్పాడు. అంతకు మునుపు అనేకసార్లు ఇలాంటి హెచ్చరికలు వచ్చినా సునామీ రాకపోవడంతో నార్త్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తన మిత్రుడ్ని తన ఇంటికి ఫోన్ చేసి తన భార్యని హెచ్చరించమని మాత్రం కోరాడు.
తల్లికి ఉత్తరం రాసే హెమెట్‌కి నార్త్ మిత్రుడు ఫోన్ చేసి సునామీ గురించి చెప్పి, పక్కింటి వారి సహాయం తీసుకుని వెళ్లిపొమ్మని, తనకి ఆమె నించి మళ్లీ ఫోన్ రాకపోతే ఆమెకి సహాయం అందినట్లుగా తను భావిస్తానని చెప్పాడు. ఆమె వెంటనే రేడియోని ఆన్ చేసి, దాని నెత్తి మీద తడితే అది పని చేసి సునామీ హెచ్చరికని విన్నది. అకస్మాత్తుగా సైరన్ మోగడం వినిపించింది. ఉప్పెన రాబోతోందని దాని అర్థం అని ఆమెకి తెలుసు. ఆమెలో భయం మొదలైంది. ఆమె కింద పడితే లేవలేదు కాబట్టి చక్రాల కుర్చీని తోసుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్లి పక్కింటి వాళ్లని సహాయం కోసం గట్టిగా పిలిచింది. కాని వారు కొత్తగా హొనలులూ రావడంతో ఇంకా ఇరుగు పొరుగుతో పరిచయం కాలేదు. వారంతా అప్పటికే అంతా వెళ్లిపోయారు. అప్పటికే మూడోసారి కూడా సైరన్ మోగింది. ఆమెలో భయం అధికమైంది. ఆమె వెంటనే టెలిఫోన్ ఆపరేటర్‌కి ఫోన్ చేసి సివిల్ డిఫెన్స్ అధికారుల నంబర్ తీసుకుని, తనని రక్షించమని కోరడానికి వారికి ఫోన్ చేసింది. ఆ నంబర్ ఎంగేజ్డ్ రాసాగింది.
* * *
ఆ సైరన్ శబ్దం వినలేనంత చెవిటివాడైన థామస్ పవర్స్ తన కారులో హొనలులూ చేరుకున్నాడు. ఆయన అప్పటికే దారి తప్పిపోయాడు కూడా. తను వెళ్లాల్సిన చిరునామా గురించి అడుగుదామంటే ఒక్క మనిషి కూడా కనపడలేదు. ‘సహాయం చేయండి’ అనే ఆడ కంఠం మాత్రం ఆయనకి పదేపదే వినిపించసాగింది.
హెమెట్ తన వీల్‌ఛైర్‌ని తోసుకుంటూ ఇంట్లోంచి బయటకి వచ్చి గేట్ వైపు దాన్ని పోనించింది. కాని మెట్లు దిగేప్పుడు అది తిరగబడటంతో ఆమె నేల మీద పడింది. మళ్లీ లేవలేక తనకి సహాయం కావాలని పెద్దగా అరవసాగింది. ఇంకో ఐదు నిమిషాల్లో సునామీ తీరాన్ని తాకబోతోందని లోపల నించి రేడియోలో ప్రకటన వినిపించింది.
దారి తెలీని థామస్ కారుని ఆపి కొన్ని అడుగులు వెనక్కి వచ్చి తన మిత్రుడి ఇంటి చిరునామా తెలుసుకోడానికి ఓ ఇంటి గేట్‌ని తెరిచాడు. ఎదురుగా నేల మీద వీల్ ఛైర్ పక్కన ఏడుస్తూ పడి ఉన్న హెమెట్ కనిపించడంతో చటుక్కున ఆమె దగ్గరికి వచ్చి ఎత్తుకున్నాడు. దాంతో ఆమె నోరు ఆయన చెవి దగ్గరికి రావడంతో ఆమె చెప్పేది వినపడింది. కాని ఎంతో ప్రశాంతంగా ఉన్న సముద్రం పక్క నించి వచ్చిన ఆయనకి అది నమ్మబుద్ధి కాలేదు. కాని తుఫాను ముందు ప్రశాంతత గురించి స్ఫురించడంతో గబగబా ఆమెని ఎత్తుకెళ్లి కార్లో కూర్చోపెట్టి, ఆమె సూచన ప్రకారం కారుని వేగంగా ముందుకి పోనించాడు. ఒక్క నిమిషం తేడాతో వారు సునామీని తప్పించుకున్నారు.
‘సహాయం చేయండి’ అనే ఆమె అరుపులు దాదాపు మైలున్నర దూరంలో ఉన్న చెవిటి వాడైన థామస్‌కి ఎలా వినిపించాయి? థామస్ తన కారుని ఆమె ఇంటి సమీపంలోనే ఆపి, ఇంకో ఇంటికి కాక దూరంగా ఉన్న ఆమె ఇంటి గేటు దగ్గరకే వెళ్లి దానే్న ఎందుకు తెరిచాడు? వారు ఒకరి ప్రాణాలు మరొకరు కాపాడటానికేనా? అది దేవుడికే తెలియాలి.
*

పద్మజ