S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచుచిరుతలు గాండ్రించలేవు..

సాధారణంగా పులులు గాండ్రిస్తాయి. చిరుతలదీ అదేతీరు. కానీ మంచుప్రాంతాల్లో సంచరించే స్నో లియోపార్డ్స్ గర్జించలేవు. వాటి స్వరపేటికలో ఎలాస్టిక్ మజిల్స్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడమే అందుకు కారణం. అందువల్ల ఇవి అరవడానికి బదులు స్టీమ్‌ఇంజన్‌నుంచి ఆవిరివదిలినప్పుడు వచ్చే శబ్దం మాదిరిగా గుర్రుమంటాయి. భారీగా ఉండే వాటి శరీరం పొడవుకన్నా ఆరురెట్ల దూరాన్ని ఒక్కగెంతులో దూకగలవు. శరీరం అంతా దట్టంగా బొచ్చు ఉండటం వీటి ప్రత్యేకత. మిగతా పులులు, చిరుతలకు భిన్నంగా వీటి అరిపాదాలలోనూ ఒత్తుగా బొచ్చు ఉంటుంది. మంచు ప్రభావం లేకుండా ఉండటానికి, అందులో పాదాలు కూరుకుపోకుండా ఉండటానికి ‘బొచ్చుతో కూడిన పాదరక్షల్లా’ అవి పనిచేస్తాయి. అన్నట్లు సైబీరియానుంటి టిబెట్, హిమాలయ ప్రాంతాల్లో, దాదాపు 12 దేశాల్లో ఇవి జీవిస్తున్నాయి. వీటి కళ్లు సాధారణంగా నీలంగాను, ఆకుపచ్చ, లేతబూడిద రంగులోనూ ఉంటాయి.

ఇవి కవలల్నే కంటాయి...
తలచుట్టూ సింహంమాదిరిగా బంగారు లేదా కాషాయరంగులో, ఒత్తుగా జుత్తు ఉండటంవల్ల ఈ చిన్నసైజు కోతులను గోల్డెన్ లయన్ టామరిన్స్ అని పిలుస్తారు. బ్రెజిల్‌లో కన్పించే ఈ జాతికోతులు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తమీద 1500 మాత్రమే ఉన్నాయని అంచనా. ఇవి దాదాపుగా ఎప్పుడూ కవలల్నే కంటాయి. వీటిశరీరంకన్నా తోక పెద్దగా ఉంటుంది. మిగతా కోతులకు భిన్నంగా ఇవి చెట్టూచేమ ఎక్కడానికి తోకలను వినియోగించవు. చెట్ల చిటారుకొమ్మన జీవించడానికి ఇష్టపడతాయి. రోజువిడిచి రోజు ఒక్కోచోట నిద్రిస్తాయి. చెట్ల తొర్రల్లో ఉండటానికి ఇష్టపడతాయి. బాగా ఎదిగిన ఈ జాతి కోతి 20 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది.

వారానికోసారి 30వేల గుడ్లు పెట్టే చేపలు

విభిన్నమైన రంగుల్లో, జీబ్రా స్ట్రిప్స్ మాదిరిగా అందంగా కన్పిస్తున్న ఈ సముద్ర చేపల పేరు లయన్‌ఫిష్. దాని రూపాన్నిబట్టి అలా పిలుస్తారు. డ్రాగన్‌ఫిష్, స్కార్పియన్ ఫిష్ అనికూడా వీటిని పిలుస్తారు. వీటికి పునరుత్పత్తి సామర్థ్యం చాలాఎక్కువ. ఆడచేప వారానికి 30వేల గుడ్లను విడుదల చేస్తుంది. వీటి శరీరం వెనుకభాగంలో 13నుంచి 18 విషంతోకూడిన ముళ్లలాంటివి ఉంటాయి. ప్రమాదం ముంచుకొచ్చినపుడు వీటితో గుచ్చి దాడి చేస్తుంది. వాటి ముళ్లు గుచ్చుకుంటే మనుషులకు వాంతులు, శరీరం మొద్దుబారడం, స్పర్శకోల్పోవడం, మగతగా ఉండటం సంభవిస్తుంది. ఇతర ప్రాణులు ప్రాణాన్ని కోల్పోవచ్చు. నిజానికి ఇవి ఆహారాన్ని సేకరించేందుకు, వేటాడేందుకు ఈ విషపు ముళ్లను ఉపయోగించవు. కేవలం ఆత్మరక్షణకు మాత్రమే వీటిని వాడతాయి.

-ఎస్.కె.కె.రవళి