S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సైన్యంతో పనేమి?

అధికార దాహం, యుద్ధకాంక్షతో సరిహద్దు దేశాల్ని ఆక్రమించుకుని తమ రాజ్యాలను విస్తరించుకునే ధోరణి పలు దేశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని దేశాల కంటే తమ దేశ సైన్యమే అతి పెద్దదనే ట్యాగ్‌లైన్ తగిలించుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటాయ కూడా. అందుకు చక్కటి ఉదాహరణ చైనా. ఈ దేశ సైనిక శక్తి ప్రపంచంలోని అన్ని దేశాల సైనికశక్తి కంటే పెద్దది. చైనా సైనిక బలం 16,00,000. మరికొన్ని దేశాల సైనిక శక్తి కూడా చైనా సైనికశక్తికి దాదాపు దగ్గరగా ఉంటుంది. ఇలా దేశాల నేతలు యుద్ధకాంక్షతో రగిలిపోవడం పరిపాటిగా మారిన ఈ రోజుల్లో కూడా ఎలాంటి మిలిటరీ ఫోర్స్ లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు. ప్రపంచంలో కొన్ని దేశాలు అస్సలు మిలిటరీనే ఏర్పాటు చేసుకోకుండా హాయిగా మనగలుగుతున్నాయి. ఆ దేశాలేమిటో చూద్దాం.

వాటికన్ సిటీ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటికన్ సిటీలో మిలిటరీ వ్యవస్థ కనిపించదు. ఇటాలియన్ దళాలే ఆ బాధ్యత తీసుకుంటాయి. 1970 నుండి ఇక్కడ ఇదే పద్ధతి కొనసాగుతోంది. జెండార్‌మెరీ కార్ప్స్ అనే పోలీస్ వ్యవస్థ ఇక్కడ శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటుంది.

పలావు
ఇక్కడ కూడా మనకు ఎలాంటి మిలిటరీ ఫోర్స్ కనిపించదు. ఇక్కడ 30 మందితో కూడిన మారిటైం సర్వైలెన్స్ యూనిట్ మాత్రం ఉంటుంది. ఇక్కడి ప్రజలు స్నేహపూరిత స్వభావం ఉన్నవారు కనుక ఎలాంటి అలజడులు ఇక్కడ మనకు కనిపించవు.
సమావో
న్యూజీలాండ్‌కి ఆనుకుని ఉండే ఈ చిన్నదేశంలో కూడా మనకు మిలిటరీ ఫోర్స్ కనిపించదు. చిన్నపాటి పోలీస్ వ్యవస్థ మాత్రం ఉంటుంది. వారు పెట్రోల్ వ్యాన్లు, పెట్రోల్ బోట్లలో తిరుగుతూ గస్తీ కాస్తుంటారు. సమావో రక్షణకు న్యూజీలాండ్ పాటు పడుతుంటుంది.
తువలు
ఇక్కడ కూడా మిలిటరీ వ్యవస్థ లేదు. పరిమితమైన పోలీసు వ్యవస్థ మాత్రం పని చేస్తుంటుంది. వాటర్‌క్రాఫ్ట్‌లు, ఇతర వాహనాలపై వారు తిరుగుతూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఉంటారు.
నౌరూ
ఆస్ట్రేలియాని ఆనుకుని ఉన్న చిన్నదేశం నౌరూ. ఇక్కడ మనకు ఎటువంటి సైనికశక్తి కనిపించదు. అయితే ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ మిలిటరీ లేని దేశాల పోలీసు వ్యవస్థ కన్నా కాస్త పెద్దది. వారే రక్షణలో పాలుపంచుకుంటూ ఉంటారు. ఆస్ట్రేలియా రక్షణ దళాలు కూడా నౌరూ రక్షణలో భాగస్వాములవుతాయి.
సాల్‌మన్ ఐలాండ్స్
ఇదొక ద్వీపకల్పం కావడం వల్ల ఇక్కడ మారిటైం సర్వైలెన్స్ యూనిట్ కనిపిస్తుంది. వారు ఆకీ, లారా అనే పెట్రోల్ బోట్లలో సంచరిస్తూ ద్వీపాన్ని రక్షిస్తుంటారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇతర పసిఫిక్ దేశాలు సాల్‌మన్ ఐలాండ్స్ రక్షణలో పాలుపంచుకుంటాయి.
లీచ్‌టెన్‌స్టీన్
1868 నుండి ఇక్కడ మిలిటరీ ఉన్న దాఖలాలు మనకు కనిపించదు. దీనికి కారణం ఆర్థికంగా స్థోమత లేకపోవడమే. అంతర్గత రక్షణకు నామమాత్రపు రక్షణ వ్యవస్థ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
అండోరా
ఎటువంటి సైనికశక్తి లేని అండోరా యూరోపియన్ సైనికశక్తి సాయంపై ఆధారపడి ఉండడం వల్ల ఇక్కడ కూడా మనకు ఎలాంటి మిలిటరీ కనిపించదు. పరిమితమైన నేషనల్ పోలీస్ వ్యవస్థ మాత్రం ఇక్కడి రక్షణ బాధ్యతలు చేపడుతుంది.

సైన్యం ఉంటేనే రక్షణ...
చుట్టూ పహారా ఉంటేనే
భద్రత ఉన్నట్టా? ఇవేవీ అవసరం లేని దేశాలు కాని దేశాలున్నాయ. వాటికి అవే రక్షణ. శాంతియుత పరిస్థితులు పరిఢవిల్లే ఈ దేశాలకు
సైన్యం అవసరమా?

మార్షల్ ఐలాండ్స్
ఇదొక చిన్న స్వతంత్ర దేశం. అయితే ఇక్కడ మనకు మిలిటరీ అన్నదే కనిపించదు. కాకపోతే అంతర్గత శాంతిభద్రతల రక్షణకు పరిమితమైన పోలీసు వ్యవస్థ మాత్రం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదొక ద్వీపకల్పం కనుక రక్షణకు ఎక్కువగా పెట్రోల్ బోట్లలో తిరుగాడే పోలీసులు కనిపిస్తారు. ప్రజలు శాంతి సామరస్యాలతో జీవిస్తుంటారు.

గ్రెనెడా
1983 నుండి గ్రెనెడాలో మిలిటరీ వ్యవస్థ లేదు. అంతర్గత రక్షణకు రాయల్ గ్రెనెడా పోలీస్ ఫోర్స్ ఏజెన్సీ పేరిట చిన్నపాటి రక్షణ వ్యవస్థ మాత్రం ఉంది. అమెరికా సహకారం ఉండడం వల్ల గ్రెనెడా రక్షణ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనగలుగుతోంది.

chitram...

వాటికన్ సిటీ

- దుర్గాప్రసాద్ సర్కార్