S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జనమే..

ఒక నాయకుడి అద్వితీయత అన్నది అతని మాటల్లో కంటే కూడా చేతల్లోనే కనిపిస్తుందన్నది మోదీయిజం. ఎందుకంటే 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు అతి సాధారణ స్థాయి నుంచి నిరుపమాన నేతగా మోదీ ఎదగడానికి కారణం విషయ స్పష్టత. భారతదేశ సమస్యలు, సవాళ్లపై లోతైన అవగాహన ఉండటంతో పాటు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై వాస్తవికతతో కూడిన ఆలోచనలను ఆవిష్కరించగలగడం. ఆ యిజం ఆయనదే. ఆ వడీ, వొరవడీ ఆయనదే.. ‘జనమేజయుడు’ వ్యాసం ద్వారా మోదీగారి గురించిన ఎన్నో విషయాలు తెలుసుకొన్నాం. మంచి కవర్‌స్టోరీని అందించినందుకు ధన్యవాదాలు.
-కె.సన్యాసిరావు (అనకాపల్లి)
సస్పెన్స్
‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ఎంతో సస్పెన్స్‌తో సాగుతోంది. విశాఖపట్నం ప్రాంతాలను మళ్లీ చూడాలనిపించేట్టు కథని అల్లిన తీరు బాగుంది. అలాగే -మల్లాది సూరిబాబు గారి ‘అమృతవర్షిణి’లో మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం గురించి, రచయిత గురించి, గాయని టంగుటూరి గురించి మాకు తెలీని ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తెలుసుకొన్నాం. ‘క్రీడ.. క్రీనీడ’లో వివిధ రకాల జంతువుల పందెల గురించి తెలుసుకొన్నాం. ఓ చిన్న మాటలో ‘శక్తి సామర్థ్యాలు’లో చెట్టును ఉదాహరణగా చూపి పాఠకులకు మంచి సందేశాన్ని అందించారు. ఆదివారం అనుబంధంలో అన్ని శీర్షికలు దేనికదే ప్రత్యేకం.
-మార్టూరు అజయ్‌కుమార్ (మురికిపూడి పోస్ట్)
కథాసాగరం
చిన్నచిన్న కథల ద్వారా జీవిత సత్యాలను వెల్లడిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే ‘మీకు మీరే డాక్టర్’ శీర్షికన అందించిన ‘సాధనతోనే జ్ఞాపకశక్తి’ వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. ఎవ్వరూ పుట్టుకతోనే మేధావులు కాలేరు. సాధనమున బఉర్ర పదును కెక్కును ధరలోన.. అంతే! మంచి శీర్షికను అందజేసినందుకు కృతజ్ఞతలు.
-యుగంధర్ (వాడ్రేవు)
సూత్రం
‘అక్షరాలోచనాలు’ శీర్షికన అందిస్తున్న కవితలు ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. ‘సహజ సూత్రం’ కవిత మమ్మల్ని ఎంతగానో అలరించింది. మానవ అస్తిత్వానికి తొలి వెలుతురు, భూగోళంపై సముద్రంలో ఏక కణ రూపమై వెలసింది.. అంటూ చక్కటి పోలికలతో భవిష్యత్తును పట్టుకొనేందుకు ప్రయత్నించారు. మంచి కవితలను అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
సూక్ష్మం
‘సండే గీత’ ద్వారా ఎన్నో చక్కటి సందేశాలను అందజేస్తున్నందుకు ధన్యవాదాలు. ‘సూక్ష్మం’ శీర్షికన అందించిన కథనం బాగుంది. కరుణ, జాలి కావాలని అనుకుంటే మనం కరుణ, జాలిని పంచాలి. ఈ ప్రపంచంలో అంత పెద్ద మాట ఎందుకు గానీ.. మన జీవితంలో పాజిటివ్ మార్పు రావాలని అనుకుంటే మనం మార్పునకు ఇష్టపడాలి. ఈ చిన్న సూక్ష్మాన్ని గ్రహిస్తే జీవితం ఆనందమయంగా మారే అవకాశం ఉంది. ఇక ‘గుండె’ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అమ్మని, గుండెని జాగ్రత్తగా గమనించిన వ్యక్తులు తమ శక్తి వున్న మేరకు పని చేస్తూనే ఉంటారు. విశ్రాంతి అవసరమే. కానీ విశ్రాంతి మాత్రమే తీసుకుంటే ఎందుకూ పనికి రాకుండా పోతాం.
-డి.వి.తులసి (విజయవాడ)
వేదాంతభరితం
‘సూట్‌కేసు’ కథ వేదాంత భరితంగా ఉంది. ‘వస్తా వట్టిదె, పోతా వట్టిదె తంటా ఎందుకంటా’ అనే పాట ఆకాశవాణిలో చాలా సంవత్సరాల క్రితం వస్తూండేది. ఈ కథ చదువుతూంటే ఆ పాట గుర్తుకొచ్చింది. వృద్ధాప్యం శాపం కాదు. కాకూడదు. అన్నీ మనం చూసే దృక్పథంలో ఉన్నాయి. తమ జీవిత అనుభవసారాన్ని నెమరువేసుకుంటూ, అవసరమైన ఇతరులకు అందించడం ఒక వరం కదా. ప్రతి సంఘటనలోనూ మంచినీ, ఆశావాదాన్నీ, మానవతా దృష్టితో గమనించి అర్థం చేసుకోవడం అత్యవసరం. స్వార్థపరత్వం అనే మన నీలి కళ్లద్దాల నుండి దృశ్యాలను చూసే, ఆ సులోచనాలు ప్రతిదాన్నీ నీలిరంగులోనే చూపుతాయి. ఆ భ్రమను వదులుకోవాలి మనం.
-కె.ఎన్.రావు (్భగ్యనగరం)
లోకాభిరామమ్
‘అదే బాగుంది’ వ్యాసం బాగుంది. లోకాభిరామమ్ శీర్షికన అందిస్తున్న వ్యాసాలన్నీ దేనికదే పోటాపోటీగా ఉంటున్నాయి. ఎన్ని చెప్పినా, నాకు పేదరీకమే బాగున్నది, అనిపిస్తుంది. కలిగిన వానికి కునుక పట్టదు. చావుకన్న భయము లేదు. గోచికన్న దరిద్రము లేదు. కనుక వాడెవడో మోసముజేసే అంటే, ఫలితమేమి. పైసలు పొయినయి. అవి మనవిగావు. కనుక పొయినయి అనుకునేది. తినే రొట్టె ఒకటి తిని దుప్పటి కప్పుకోని పండుకునేది. నిద్రమ్మ వద్దన్నా వచ్చి జోకొడుతుంది. ఇటువంటి బతుకులోని కథలు ఆసక్తికరముగ ఉంటయా? లేక మందిని ముంచి, నిద్ర రాక, పిచ్చి లేచిన వాని సంగతులు బాగుంటయా? అన్న మాటలు అక్షర సత్యాలు.
-పొన్నం రాజయ్య గౌడ్ (ముషీరాబాద్)
అమృతవర్షిణి
ఈ శీర్షికన అందిస్తున్న వ్యాసాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంటున్నాయి. ములాధారం నుంచి పుట్టే నాదం ఉనికిని పట్టుకోవడం అందరివల్లా కాదు. అదే దొరికితే సద్గురువు చిదానంద స్వరూపులై పోతారు. ‘ప్రాప్తం’ అంటూ ఉంటే ప్రయత్నం చేయాలనే సంకల్పం బలంగా ఏర్పడేలా భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. -వి.రాధాదేవి (నల్గొండ)