S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 01:58

కాకినాడ, డిసెంబరు 1: ఎపి ఎంసెట్-2017ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇందుకు సంబంధించిన ఏజన్సీ ఎంపికకు కసరత్తు ప్రారంభమయ్యింది. 2017 ఏప్రిల్‌లో ఎపి ఎంసెట్‌ను నిర్వహించడానికి కాకినాడ జెఎన్‌టియు ఏర్పాట్లు చేస్తోంది. గత మూడేళ్లుగా ఎంసెట్‌ను కాకినాడ జెఎన్‌టియు నిర్వహిస్తోంది.

12/02/2016 - 01:57

హైదరాబాద్, డిసెంబర్ 1: పదో తరగతి పరీక్షల షెడ్యూలు ఖరారైనా, హాల్‌టిక్కెట్లు సిద్ధం అవుతున్నా, తెలంగాణలోని స్కూళ్లలో పదో తరగతి పరీక్షల సిలబస్ పూర్తికాలేదు. నూరు శాతం సిలబస్ ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి కావల్సి ఉండగా, డిసెంబర్ మొదటి వారానికి కనీసం 80 శాతం సిలబస్ పూర్తికావాల్సి ఉంది. కాని కనీసం 50 నుండి 60 శాతం సిలబస్ కూడా పూర్తికాలేదు.

12/02/2016 - 01:28

హైదరాబాద్, డిసెంబర్ 1: ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీ సీట్లలో కోత ఉండబోదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. ఎంసిఐ ఎత్తి చూపిన లోపాలన్నింటినీ సరిదిద్దుతామని, సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో చర్చించనున్నట్టు చెప్పారు.

12/02/2016 - 01:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌లలో ఒకరైన సనత్ జయసూర్య టీమిండియా కెప్టెన్ వారాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. కోహ్లీ ఒక గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన తీరును, ఆట పట్ల అతని అంకిత భావాన్ని జయసూర్య ప్రశంసించాడు. ‘విరాట్ కోహ్లీ అంకితభావం కలిగిన క్రికెటర్. ప్రతి మ్యాచ్‌కి మందు అతను ఎంతో శ్రమించి ప్రాక్టీస్ చేయడమే కాక శిక్షణ పొందుతాడు.

12/02/2016 - 01:18

విజయవాడ, డిసెంబర్ 1: జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో కొత్తగా 3.5 లక్షల మందికి సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

12/02/2016 - 01:11

అమరావతి, డిసెంబర్ 1: ఒకటోతారీఖు వచ్చింది. సాయంత్రం వరకూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెల్‌ఫోన్ మెసేజీలు చూడటంతోనే సరిపోయింది. మధ్యాహ్నానికి కొందరికి, సాయంత్రానికి ఇంకొందరికి సెల్‌ఫోన్ గంటలు మోగాయి. కానీ.. ఏం ఉపయోగం? దానిని నగదుగా మార్చుకునే అదృష్టం లేకపోయింది. ఏటిఎంలు వెక్కిరిస్తుంటే బిక్కముఖం వేయాల్సిన దుస్థితి. కొన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులయితే అసలు జీతాల గంట మోగనేలేదు.

12/02/2016 - 01:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: బంగారంపై కేంద్రం పన్ను విధిస్తుందని, జరిమానా వేస్తుందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ, ప్రత్యక్ష పన్నుల విభాగం(సిబిడిటి) వివరణ ఇచ్చాయి. పసిడిపై పన్నుకు సంబంధించి వస్తున్న వదంతులు వేటినీ నమ్మరాదంటూ గురువారం సిబిడిటి స్పష్టమైన ప్రకటన చేసింది. వారసత్వంగా సంక్రమించిన బంగారంపై కానీ, వెల్లడించిన ఆదాయంతో కొన్న బంగారంపై కానీ ఎలాంటి పన్నూ ఉండవని తేల్చి చెప్పింది.

12/02/2016 - 01:06

న్యూఢిల్లీ, డిసెంబరు 1: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక శాఖ నుంచి 2,981 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు ఆర్థికశాఖ సమాచారం పంపించినట్టు తెలిపారు. నాబార్డ్‌నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు.

12/02/2016 - 01:04

విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలోని పురపాలక సంఘాల చైర్‌పర్సన్‌లు, మేయర్లు గౌరవ వేతనాలను పెంచుతూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.6.5 కోట్ల మేరకు భారం పడనుంది. మేయర్లకు 14 వేల నుంచి 30 వేలకు, డిప్యూటీ మేయర్లకు 8 వేల నుంచి 20 వేల రూపాయలకు, కార్పొరేటర్లకు 4000 నుంచి 6000 రూపాయలకు పెంచేందుకు మంత్రివర్గం అమోదించింది.

12/02/2016 - 00:43

న్యూయార్క్, డిసెంబర్ 1: చదరంగ ప్రపంచంలో నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైబ్రేకర్‌లో బుధవారం అతను రష్యాకు చెందిన సెర్గీ కర్యాకిన్‌ను ఓడించి వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచాడు.

Pages