S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 00:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన చర్యలు చేపడుతున్నామని, బ్యాంకుల్లో తగినంత నగదు నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. గ్రామాల్లో ఎటిఎమ్‌ల సేవలు లేకపోవడంతో ప్రజలు అన్ని అవసరాలకు బ్యాంకులనే ఆశ్రయిస్తున్నారు.

12/10/2016 - 00:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 1,721 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. ఆదాయం 7,331 కోట్ల రూపాయలుగా ఉందన్నారు.

12/10/2016 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ట్విట్టర్, ఈ-మెయిల్ ఖాతాలు చౌర్యానికి గురయ్యాయి. ఈ మేరకు శుక్రవారం మాల్యా తెలియపరిచారు. లీజియన్ పేరుతో హ్యాకర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పారు. కాగా, మాల్యాకి చెందిన బ్యాంక్ ఖాతా, విదేశీ పెట్టుబడులు, లగ్జరీ కార్లు, పాస్‌వర్డులు, ఫోన్ నంబర్ల వివరాలను హ్యాకర్ వెల్లడించాడు. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలనిస్తానన్నాడు.

12/10/2016 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) పడకేసింది. అక్టోబర్‌లో మైనస్ 1.9 శాతానికి క్షీణించింది. పడిపోయిన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి, పేలవమైన తయారీరంగ ప్రదర్శన కారణంగా మళ్లీ ఐఐపి గణాంకాలు రుణాత్మకంగానే నమోదయ్యాయి. ఐఐపిలో తయారీ రంగం వాటానే 75 శాతానికిపైగా ఉంటుంది.

12/10/2016 - 00:31

ముంబయి, డిసెంబర్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 52.90 పాయింట్లు పెరిగి నెల రోజుల గరిష్ఠాన్ని తాకుతూ 26,747.18 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 14.90 పాయింట్లు అందుకుని 8,261.75 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 516.52 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 174.95 పాయింట్లు ఎగిసింది.

12/10/2016 - 00:29

హైదరాబాద్, డిసెంబర్ 9: సరిహద్దుల ద్వారా దేశంలోకి అక్రమ రవాణా అవుతున్న బంగారం, సిగరెట్లు, యంత్రాల విడిభాగాలు, పట్టు, నూలు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిరోధించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) పటిష్టమైన ప్రణాళికతో పనిచేస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి హేమ పాండే అన్నారు.

12/10/2016 - 00:29

రాజమహేంద్రవరం, డిసెంబర్ 9: పంచాయతీలు విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కోత తప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ బి రామాంజనేయులు హెచ్చరించారు. బకాయిలు లేకుండా సక్రమంగా చెల్లిస్తే నిధులు పూర్తిగా విడుదలవుతాయన్నారు. 2014 డిసెంబర్ వరకు ఉన్న విద్యుత్ బకాయిలను తర్వాత కట్టినప్పటికీ, 2015 జనవరి నుంచి మాత్రం విద్యుత్ బిల్లుల బకాయిలను సక్రమంగా కట్టాలన్నారు.

12/10/2016 - 00:27

విశాఖపట్నం, డిసెంబర్ 9: ఆంధ్రా విశ్వవిద్యాలయం మహామహులు పట్టాలు పుచ్చుకున్నది ఇక్కడే. ఇక్కడ చదివిన ప్రముఖులు దేశ, విదేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సహకారం లేక ఆర్థికంగా తవ్ర ఇబ్బందుల్లో ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఉద్ధరించాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల సహకారం కోరాలని నిర్ణయించారు.

12/10/2016 - 00:26

విప్లవాత్మక స్టార్టప్.. అడాప్ట్ మోటార్స్ శుక్రవారం హైదరాబాద్‌లో రెండు సరికొత్త శ్రేణి త్రీ వీలర్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. స్వీకర్, స్వీకర్ ఎల్ పేరిట ముందుకొచ్చిన వీటిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, పలువురు రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. స్వీకర్ ఆటో ప్యాసింజర్ మోడల్ అవగా, స్వీకర్ ఎల్ ఆటో కార్గో మోడల్ అని సంస్థ ప్రతినిధులు వివరించారు.

12/10/2016 - 00:24

ముంబయి, డిసెంబర్ 9: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో తమ 3.9 శాతం వాటాను అమ్మేయనుంది. గ్లోబల్ ఇనె్వస్ట్‌మెంట్ సంస్థలైన కెకెఆర్, టెమసెక్‌లకు 1,794 కోట్ల రూపాయలకు ఈ వాటాను ఎస్‌బిఐ విక్రయిస్తోంది. ఈ విక్రయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆమోదం లభించినట్లు ఎస్‌బిఐ తెలిపింది. ఒక్కో షేర్‌ను 460 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పింది.

Pages