S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/22/2016 - 00:29

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసితోపాటు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బ్రిటిష్ పెట్రోలియం.. చిన్న చమురు క్షేత్రాల వేలానికి దూరంగా ఉన్నాయి. సోమవారం ఇక్కడ జరిగిన ఆన్‌లైన్ వేలంలో 46 చమురు, గ్యాస్ క్షేత్రాల్లో 34 క్షేత్రాలకే బిడ్లు దాఖలయ్యాయి. ఈ 34 క్షేత్రాల్లోనూ 14 క్షేత్రాలకు కేవలం ఒక్కొక్క బిడ్ మాత్రమే వచ్చింది.

11/22/2016 - 00:28

న్యూఢిల్లీ, నవంబర్ 21: ఎగుమతిదారులకు నగదు ఉపసంహరణ పరిమితి పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని అడుగుతానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ ఎగుమతి ప్రోత్సాహ మండళ్లతో గంటపాటు జరిపిన సమావేశం అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ఎగుమతిదారులకు తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

11/22/2016 - 00:27

విశాఖపట్నం, నవంబర్ 21: పరిశ్రమల్లో ఉత్పత్తికి ఎటువంటి అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడిసిఎల్) ప్రత్యేక కార్యాచరణను తయారు చేస్తోంది. రానున్న వేసవి సీజన్‌తోపాటు ఏ ఒక్కరోజూ విద్యుత్ కోతలు, అంతరాయాలు, సరఫరాలో లోపాలు లేకుండా నిరంతర విద్యుత్ ద్వారా పారిశ్రామిక ఉత్పత్తికి విఘాతం కలుగకుండా చేయాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది.

11/22/2016 - 00:25

ఆదిలాబాద్, నవంబర్ 21: ఈ ఖరీఫ్‌లో పత్తికి మద్దతు ధర ఉండదని.. ప్రత్యామ్నాయ పప్పు దినుసు పంటలే వేసుకోవాలని వ్యవసాయ క్షేత్ర అధికారి నుండి ముఖ్యమంత్రి వరకు సాగించిన విస్తృత ప్రచారం రైతులకు తీరని వ్యదను మిగిల్చింది. సర్కారు మాటలను నమ్మి పత్తిపంట సాగు విస్తీర్ణం అమాంతం తగ్గించి సోయాబీన్, పప్పు దినుసు పంటలు వేసిన రైతులు మార్కెట్‌లో మద్దతు ధరలేక, ఆశించిన దిగుబడులు రాక లబోదిబోమంటున్నారు.

11/22/2016 - 00:23

హైదరాబాద్, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దుకు రెండు రోజుల ముందే హడావుడిగా తమ షేర్లను అమ్మేసుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవం లేదని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అధ్యక్షుడు ఎం సాంబశివ రావు ఖండించారు. రెండు రోజుల ముందు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను విక్రయించలేదని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

11/22/2016 - 00:23

హైదరాబాద్, నవంబర్ 21: జపాన్‌లోని అంతర్జాతీయ సంస్థ ఆసియా ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్‌లో భారత్ నుండి జాతీయ నిపుణుడిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)కి చెందిన ప్రొఫెసర్ వేదుల్ల వెంకట రమణ నియమితులయ్యారు.

11/22/2016 - 00:22

గుంటూరు, నవంబర్ 21: ప్రజల ఆరోగ్యానికి నష్టం జరిగేలా వ్యాపారులు ఆహార పదార్థాల్లో కల్తీచేసి విక్రయిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. సోమవారం గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో శీతల గిడ్డంగుల నిర్వాహకులు, కారం మిల్లుల యజమానులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

11/22/2016 - 00:21

విజయవాడ, నవంబర్ 21: నవ్యాంధ్రలో ఒక ఉద్యమంలా పరిశ్రమల స్థాపనకు భారీ పారిశ్రామిక సంస్థలు ముందుకొస్తున్నాయి. అన్నిరకాల పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

11/22/2016 - 00:17

భారత నావికా దళంలోకి మరో కొత్త నౌక చేరింది. ముంబయలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ‘ఐఎన్‌ఎస్ చెన్నై’ యుద్ధ నౌకను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సోమవారం నౌకా దళానికి అప్పగించారు. ఈ నౌక 60 శాతం భారత్‌లోనే తయారు కాగా, సెన్సార్లు, ఆయుధాల వంటి వాటిని రష్యా, ఇజ్రాయెల్ దేశాలు సమకూర్చాయ.

11/22/2016 - 00:14

పుఖ్రాయన్, నవంబర్ 21: ఉత్తరప్రదేశ్‌లో ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 143కు పెరిగింది. కాన్పూర్ రూరల్ ఏరియాలోని పుఖ్రాయన్‌లో పట్టాలు తప్పి నుజ్జునుజ్జయిన రైలు బోగీల నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చే కార్యక్రమాన్ని సహాయ సిబ్బంది ఆదివారం రాత్రంతా కొనసాగించారు. పట్టాలు తప్పి ధ్వంసమైన మొత్తం 14 బోగీలను ట్రాక్‌ల పైనుంచి తొలగించారు.

Pages